మేడమ్ టుసాడ్స్‌లో మైనపు బొమ్మగా మెరిసిపోవడమనేది చాలా అరుదైన గౌరవం. అతి కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. ఇంతవరకూ బాలీవుడ్ ప్రముఖ నటుల్లో షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ తదితర ప్రముఖ నటీ నటులకు మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈ అవకాశం 'బాహుబలి' సినిమాతో ప్రబాస్‌కి దక్కింది. బ్యాంకాక్‌లోని మేడమ్ టుసాడ్స్‌లో ప్రబాస్ మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఒక్క 'బాహుబలి' 100 సినిమాలతో సమానం అని పేర్కొన్నారు అక్కడ. ఈ మ్యూజియంలో చోటు దక్కించుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరో ప్రబాస్ మాత్రమే. ఈ మైనపు బొమ్మ చాలా బాగుంది. 'బాహుబలి' గెటప్‌లో ఉన్న ఈ మైనపు బొమ్మను చూసి తెలుగు చిత్ర సీమ అంతా గర్వపడుతోంది. 'బాహుబలి' సినిమాతో వచ్చిన మరో గొప్ప గుర్తింపు ఈ మైనపు బొమ్మ ఏర్పాటు. బాహుబలి సినిమా తెచ్చిన ఖ్యాతి అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపు అది. ఈ మ్యూజియంను ఇకపై ఢిల్లీలో కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఏర్పాటు కాబోయే ఈ మ్యూజియంలక్ష దాదాపుగా సౌత్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖ నటీ నటుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేస్తారట.