హ్యాట్సాఫ్‌ టు మెగా అల్లుడు.!

By iQlikMovies - February 11, 2019 - 16:45 PM IST

మరిన్ని వార్తలు

'విజేత' సినిమాతో హీరోగా సత్తా చాటాడు మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్‌. ఇప్పుడు రెండో సినిమాకి సిద్ధమవుతున్నాడు. పులివాసు దర్శకత్వంలో ఓ సినిమాకి కళ్యాణ్‌దేవ్‌ సైన్‌ చేసిన సంగతి తెలిసిందే. 'తూనీగా తూనీగా..' ఫేం రియా చక్రవర్తి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట్లో మెహ్రీన్‌ని అనుకున్నారు. కానీ కుదరలేదు. దాంతో రియాని ఎంచుకున్నారు. 

 

ఇదిలా ఉంటే, కళ్యాణ్‌దేవ్‌ తాజాగా ట్విట్టర్‌లోకి ఎంటర్‌ అయ్యాడు. ఈ రోజు కళ్యాణ్‌దేవ్‌ పుట్టినరోజు. ట్విట్టర్‌ వేదికగా కళ్యాణ్‌దేవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు పోటెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కళ్యాణ్‌దేవ్‌ అరుదైన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అవయవ దానంపై అవగాహన మరింత పెరగాలన్నాడు. అవయవ దానం చేస్తానని అనుమతి పత్రంపై దేవ్‌ సంతకం చేశాడు. పుట్టినరోజు నాడు కళ్యాణ్‌దేవ్‌ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. 

 

కాగా కళ్యాణ్‌దేవ్‌ తాజా సినిమా విషయానికి వస్తే, పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందట. యాక్షన్‌ ఎపిసోడ్స్‌కి బాగా స్కోప్‌ ఉందట ఈ సినిమాలో. తొలి సినిమాకే నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ మెగా అల్లుడు రెండో సినిమాతో మరింత మంచి గుర్తింపు తెచ్చుకోవాలనీ, మరెన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించాలనీ ఆశిస్తూ, మనం కూడా బర్త్‌డే విషెస్‌ చెప్పేద్దాం. హ్యాపీ బర్త్‌డే టు కళ్యాణ్‌దేవ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS