'ఆర్‌ఆర్‌ఆర్‌' ఇది నిజమేనా రామా.?

మరిన్ని వార్తలు

నిప్పు లేనిదే పొగ రాదంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయంలో అదే జరుగుతోంది. స్టోరీ ఇలా ఉండబోతోందట. అలా ఉండబోతోందట అంటూ పొగ రాజేశారు. అది నిజమే అయ్యిందనిపిస్తోంది తాజాగా లీకైన 'ఆర్‌ఆర్‌ఆర్‌' పిక్స్‌తో. ఇదో పీరియాడిక్‌ డ్రామా అని తెలిసిపోయింది. ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌ పాత్ర పేరు ఇదీ అనే న్యూస్‌ వైరల్‌ అవుతోంది. చరణ్‌ ఈ సినిమాలో రామరాజు అనే పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం జరుగుతోంది. బ్రిటీష్‌ కాలం నాటి ఓ పోలీస్ ఆఫీసర్‌ పాత్రట అది. 

 

అఅణువణువునా దేశభక్తి నింపుకున్న ఈ పోలీస్ ఆఫీసర్‌, బ్రిటీష్‌ వారిని దెబ్బ కొట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తాడట. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోంది ఈ తాజా సమాచారమ్‌. 'వినయ విధేయ రామ' సినిమాలో కుటుంబం కోసం ప్రాణాలైన ధారపోసే రాముడిగా కనిపించిన రామ్‌చరణ్‌ ఈ సారి దేశం కోసం ప్రాణాలర్పించే యువ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడన్న మాట. అయితే ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, లీకేజీ ఫోటోలకీ, ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ రామ్‌చరణ్‌ పాత్ర తాలూకు న్యూస్‌కీ దగ్గర సంబంధం లేకపోలేదు. 

 

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోన్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలో మరో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నటించబోతున్నాడనీ తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, అజయ్‌ దేవగణ్‌. అజయ్‌ దేవగణ్‌కీ, రాజమౌళికీ మంచి స్నేహబంధం ఉంది. అలాగే రామ్‌చరణ్‌కి కూడా అజయ్‌దేవగణ్‌ మంచి స్నేహితుడు. సో అజయ్‌ కోసం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో ఓ గెస్ట్‌ రోల్‌ సిద్ధమవుతోందట. అదేంటో ప్రస్తుతానికి సస్పెన్సే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS