సంక్రాంతికి మరో 'శతమానం భవతి'

మరిన్ని వార్తలు

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రేస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ నటించిన 'అల వైకుంటపురములో' ఒకటి, మహేష్‌ నటించిన 'సరిలేరు నీకెవ్వరు' మరోటి. వీటి మధ్యన రిలీజ్‌ అయ్యేందుకు మరికొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఓ మోస్తరు చిన్న సినిమాలున్నాయి. బాలయ్య, వెంకటేష్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, వీటిలో సంక్రాంతి రేస్‌కి డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నట్లుగా ఇంతవరకూ ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ రాలేదు ఆయా సినిమాల్లో.

 

అయితే, కళ్యాణ్‌రామ్‌ నటించిన 'ఎంత మంచివాడవురా' సినిమా సంక్రాంతికి వస్తుందని లేటెస్ట్‌గా రిలీజ్‌ చేసిన టీజర్‌ ద్వారా చెప్పారు. ఈ సినిమాని సతీష్‌ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. ఒక ఏడాది స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలయ్యలకు పోటీగా అసలు అంచనాలే లేకుండా సతీష్‌ వేగేశ్న 'శతమానం భవతి' సినిమాను విడుదల చేసి మంచి విజయం అందుకున్నాడు. అలాగే, ఇప్పుడు మహేష్‌, బన్నీలకు పోటీగా కళ్యాణ్‌రామ్‌తో 'ఎంత మంచివాడవురా' సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

 

ఈ సినిమా మరో 'శతమానం భవతి' అవుతుందని సతీష్‌ వేగేశ్న నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌ చూస్తే ఎంటర్‌టైనింగ్‌ కంటెంట్‌లానే అనిపిస్తోంది. పండగ సీజన్‌లో ఎన్ని సినిమాలొచ్చినా ఆదరించగల స్టామినా ఉంది ఆడియన్స్‌కి. సో టైం కలిసొస్తే, కళ్యాణ్‌రామ్‌కి 'ఎంత మంచి వాడవురా' మంచి హిట్‌ అవుతుందనడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS