శ్రీముఖి గేమ్‌ మహేష్‌కి నచ్చలేదా?

మరిన్ని వార్తలు

హౌస్‌ నుండి బయటికి వెళుతూ వెళుతూ, మహేష్‌ విట్టా నిజాలు నిగ్గుదేల్చేశాడు. ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ అమ్మాయిలదే అని మహేష్‌ జోస్యం చెప్పేశాడు. మహేష్‌ విట్టా ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలున్నారు. వారిలో శివజ్యోతి, వితిక స్ట్రాంగెస్ట్‌ అని మహేష్‌ చెప్పాడు. అయితే, శ్రీముఖిపై మాత్రం కొంత బురద చల్లే ప్రయత్నం చేశాడు మహేష్‌.

 

నిజానికి అది బురద చల్లే ప్రయత్నంగా కూడా చెప్పలేం. శ్రీముఖి గేమ్‌ స్ట్రాటజీనే అది. ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ కోసం శ్రీముఖి తహతహలాడుతుంది. ఎవరికైనా హౌస్‌లో బాధ కలిగినా, దెబ్బలు తగిలినా.. అందరం వారికి అండగా ఉంటాం. కానీ, శ్రీముఖి, అందరి కంటే అత్యుత్సాహం చూపుతుందనీ, అదంతా స్క్రీన్‌ స్పేస్‌ కోసమేననీ, టాస్క్‌ల్లో ఆమె పర్‌ఫామెన్స్‌ అంత బెటర్‌గా ఉండదనీ మహేష్‌ చెప్పాడు. టోటల్‌గా శ్రీముఖి గేమ్‌ తనకు నచ్చలేదన్నాడు. అంటే, వితిక, శివజ్యోతిలలో ఎవరికి టైటిల్‌ దక్కినా ఫర్వాలేదు కానీ, శ్రీముఖి టైటిల్‌ దక్కించుకోవడం మహేష్‌కి ఇష్టం లేదనిపిస్తోంది. ఇకపోతే, రాహుల్‌ని చిన్నపిల్లాడిగా అభివర్ణించాడు.

 

రాహుల్‌ తిట్టినా, తనకు కోపం రాదన్నాడు. వితిక డ్రెస్సింగ్‌ స్టైల్‌ అంటే తనకెంతో ఇష్టమన్నాడు. టాస్క్‌ల వీరుడు అలీ రెజా అని చెప్పాడు కానీ, రీ ఎంట్రీలో అలీ గతంలో ఇచ్చిన పర్‌ఫామెన్స్‌ ఇవ్వడం లేదని చెప్పాడు. మరో విషయమేంటంటే, మహేష్‌ విట్టా ఎలిమినేషన్‌ సందర్భంగా, హోస్ట్‌ నాగార్జున మహేష్‌ని ఓ విషయం అడగడం మర్చిపోయాడు. మళ్లీ అవకాశమొస్తే, హౌస్‌లోకి వెళతావా.? అని నాగ్‌ అడగలేదు. ఒకవేళ అడిగితే, నిజాలే చెప్పే మహేష్‌ నుండి ఎలాంటి ఆసక్తికరమైన సమాధానం వచ్చేదో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS