కళ్యాణ్ రామ్ కి గాయాలు

మరిన్ని వార్తలు

నందమూరి కళ్యాణ్‌రామ్‌ తాజాగా జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌తో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ ఇద్దరి మధ్యా ఈ మధ్యనే ఓ రొమాంటిక్‌ సాంగ్‌ చిత్రీకరించారు కూడా. ఈ పాట సినిమాకే మెయిన్‌ అట్రాక్షన్‌గా తీర్చి దిద్దారట. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో కళ్యాణ్‌రామ్‌ గాయపడినట్లు సమాచారమ్‌. 

వికారాబాద్‌లో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా, ప్రమాదవశాత్తూ కళ్యాణ్‌రామ్‌ గాయపడ్డాడట. అయినా కానీ షూటింగ్‌కి విరామం ఇవ్వకుండా, కళ్యాణ్‌రామ్‌ పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుని షూటింగ్‌లో పాల్గొన్నాడట. కళ్యాణ్‌రామ్‌ డెడికేషన్‌కి చిత్ర యూనిట్‌ షాక్‌ తిన్నది. ఆయన డెడికేషన్‌కి హ్యాట్సాఫ్‌ చెబుతూ, చేయాల్సిన షూటింగ్‌ పార్ట్‌ కంప్లీట్‌ చేసేసిందట చిత్ర యూనిట్‌. తొలిసారిగా మిల్కీ బ్యూటీ తమన్నా కళ్యాణ్‌రామ్‌తో జత కడుతోంది ఈ సినిమాలో. 

మరో పక్క కాజల్‌తో కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న చిత్రం 'ఎమ్మెల్యే'. ఈ మధ్యనే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది 'ఎమ్మెల్యే'. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. కాజల్‌ తన మొదటి సినిమా 'లక్ష్మీ కళ్యాణం'లో కళ్యాణ్‌రామ్‌తో నటించింది. ప్రస్తుతం ఈ చందమామ బ్యూటీ స్టార్‌ హీరోయిన్‌ హోదాని అలంకరించింది. మెగాస్టార్‌ చిరంజీవితో నటించి, మెగా హీరోయిన్‌ ట్యాగ్‌ కూడా ధరించేసింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కళ్యాణ్‌రామ్‌తో కాజల్‌ జత కట్టిన చిత్రం 'ఎమ్యెల్యే'. ఈ సినిమా తర్వాత కళ్యాణ్‌ రామ్‌ చేస్తున్న ఈ తాజా చిత్రం కోసం మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చి చేరింది. 

ఇదిలా ఉండగా ఇటీవలే తమ్ముడు ఎన్టీఆర్‌తో కళ్యాణ్‌రామ్‌ 'జై లవకుశ' చిత్రాన్ని నిర్మించాడు. నిర్మాతగా ఈ సినిమాతో హిట్‌ కొట్టాడు. ఇప్పుడు హీరోగా 'ఎమ్యెల్యే'తో హిట్‌ బరిలో ఉన్నాడు కళ్యాణ్‌రామ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS