కళ్యాణ్‌రామ్ తాజా చిత్రం '118' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాకి టాక్ బాగానే వచ్చింది. పోజిటివ్ రివ్యూలు రాబట్టింది '118' చిత్రం. కల్లో వచ్చిన అమ్మాయికి ఏమైందో అని హీరో పడే టెన్షన్‌ని బాగా చూపించారు. ఈ పాయింట్ చుట్టూ కథను అల్లుకోవడంలో డైరెక్టర్ విజన్‌ని అందరూ మెచ్చుకుంటున్నారు. మొత్తానికి కళ్యాణ్‌రామ్ ఈ సినిమాతో ఫర్వాలేదనిపించాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలేమీ కళ్యాణ్‌రామ్‌కి ఈ రకమైన సంతృప్తిని అందించలేదు.
ప్రచార చిత్రాలతో క్రియేట్ చేసిన క్యూరియాసిటీ రిలీజ్ తర్వాత సినిమా చూసిన ప్రతీ ఒక్కరినీ శాటిస్‌ఫై చేసింది. అయితే ఇది ఎగ్జామ్స్ సీజన్. ఈ సీజన్‌లో ఎలాంటి హిట్ సినిమా అయినా గట్టెక్కడం కాస్త కష్టమే. అయితే తెరపై కళ్యాణ్‌రామ్ ముఖంలో కనిపించిన టెన్షన్ ధియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రతీ ప్రేక్షకుడూ ఫీలవ్వగలిగితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
ఇక కలెక్షన్స్ మాటంటారా.? అది మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేం. ఈ వారం గడిస్తే ఓ క్లారిటీకి రావచ్చు. సినిమాటోగ్రాఫర్ కే వీ గుహన్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందింది.