కళ్యాణ్ రామ్-మోక్షాజ్ఞ కలిసి నటించట్లేదా?

మరిన్ని వార్తలు

కళ్యాణ్ రామ్-మోక్షాజ్ఞ కలిసి ఒకే చిత్రంలో కనపడనున్నారు అని అది కూడా ఎన్టీఆర్ జీవితం పై తెరకెక్కిస్తున్న చిత్రంలో అన్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఆనందం రేకేత్తిచ్చింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదు అని తెలుస్తున్నది.

వివరాల్లోకి వెళితే, హరికృష్ణ అలాగే బాలకృష్ణ పాత్రల నిడివి వీళ్ళు తీయబోయే ఎన్టీఆర్ చిత్రంలో బాగా తక్కువుగా ఉండబోతుందట! ఆ కారణంగానే ఇంతటి చిన్న పాత్రలకి వారిని తీసుకోవడం ఎంతవరకు సబబు అన్న ఆలోచనలో కూడా సదరు యూనిట్ ఉన్నట్టు సమాచారం.

 

ఇక కళ్యాణ్ రామ్ సన్నిహిత వర్గాలు కూడా హరికృష్ణ పాత్రకి ఆయనని సంప్రదించలేదు అని చెప్పారు. ఇదిలావుండగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ కి వెళ్ళనుందట.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS