'డియో డియో..' సన్నీ ఊపేస్తుందోయ్‌!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌ రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'పీఎస్‌వీ గరుడవేగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో సన్నీ ఓ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించింది. ఈ సాంగ్‌లోని సన్నీ స్టెప్పులు మాస్‌ ఆడియన్స్‌ని ఊపు ఊపేస్తున్నాయి. 'డియో డియో..డించకా, డించకా..' అంటూ సాగే ఈ పాటలో సన్నీలియోన్‌ స్టెప్పులు చాలా కొత్తగా ఉన్నాయి. సన్నీలియోన్‌ మంచి డాన్సర్‌. కానీ ఈ సాంగ్‌ కోసం వేసిన స్టెప్పులు ఆమెకు చాలా కొత్తగా ఉన్నాయి. పక్కా ఊర మాస్‌ స్టెప్పులవి. ఈ సాంగ్‌ ప్రోమోస్‌ స్పెషల్‌గా ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. సినిమాకే ఈ సాంగ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కానుంది. సన్నీ కాస్ట్యూమ్స్‌, రిధమ్‌కి తగ్గట్లుగా ఆమె వేసిన స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌ ఒక్కటేమిటీ, సరికొత్తగా ఉంది హాట్‌ బ్యూటీ సన్నీలియోన్‌ ఈ సాంగ్‌లో. ప్రవీణ్‌ సత్తారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన 'గరుడవేగ' ట్రైలర్‌కి రెస్పాన్స్‌ అదిరిపోతోంది. చాలా కాలం తర్వాత రాజశేఖర్‌ ఓ మంచి సినిమాలో నటించారనే అనుభూతి ఈ ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉంది ఈ ట్రైలర్‌. ఖచ్చితంగా ఈ సినిమా రాజశేఖర్‌కి మంచి విజయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఎన్‌.ఐ.ఏ అధికారి పాత్రలో రాజశేఖర్‌ నటిస్తున్నారు. పూజా కుమార్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎన్నో పోలీసు పాత్రలు వేసిన రాజశేఖర్‌కి ఈ సినిమాలో ఎన్‌ఐఏ అధికారి పాత్ర చాలా ప్రత్యేకమంటున్నారు. దేశరక్షణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. విజువల్‌గా అద్భుతంగా ఉండబోతోంది. నవంబర్‌ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS