'సమ్మోహనం': అంతా సిద్దమవ్వాల్సిందే.!

By iQlikMovies - June 13, 2018 - 15:56 PM IST

మరిన్ని వార్తలు

మాంచి విషయమున్న హీరో సుధీర్‌బాబు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలను కాకుండా, విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ, ముందుకెళ్తున్నాడు. 'ప్రేమకథా చిత్రమ్‌' సినిమాతో సూపర్‌ సక్సెస్‌ కొట్టిన సుధీర్‌బాబు, ఆ తర్వాతి నుండీ విభిన్న కథా చిత్రాలనే ఎంచుకుంటూ వచ్చాడు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ సంగతి పక్కన పెడితే, నా రూటే సెపరేటు అనే రీతిలో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. 

ఈ శుక్రవారం సుధీర్‌బాబు నటించిన 'సమ్మోహనం' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సమ్మోహనం' అంటే హిప్నటైజ్‌ చేయడం, లోబర్చుకోవడం అనే అర్ధాలున్నాయి. ఈ టైటిల్‌తోనే సుధీర్‌బాబు అందర్నీ హిప్నటైజ్‌ చేసేశాడు. ప్రోమోస్‌తో ఇక కట్టి పడేస్తున్నాడు. స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ కలిగిస్తున్నాడు. ఏం చూపించారు సినిమాలో అనే ఆశక్తిని రేకెత్తిస్తున్నాడు. సినిమా స్టార్స్‌ అంటే అస్సలు ఇష్టపడని ఓ కుర్రోడు సినిమా హీరోయిన్‌ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆ కుర్రోడికి ఎదురయ్యే పరిస్థితులేంటనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 

చిన్న సినిమాలైనా అభిరుచి గల చిత్రాలను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ముద్దుగుమ్మ అదితీరావ్‌ హైదరీ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకుని అందర్నీ సమ్మోహించిందీ ముద్దుగుమ్మ. అంతేకాదు, తన అందంతోనూ మెస్మరైజ్‌ చేస్తోంది. అందుకేగా వస్తూ వస్తూనే ఈ బ్యూటీ మెగా కాంపౌండ్‌లో ఆఫర్‌ కొట్టేసింది.

 

వరుణ్‌తేజ్‌ హీరోగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అంతరిక్షం (వర్కింగ్‌ టైటిల్‌)' లోఈ అదితి హీరోయిన్‌గా నటిస్తోంది. చూడాలిక ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న 'సమ్మోహనం' టీమ్‌ ఆడియన్స్‌కి ఎలాంటి ఫీల్‌ కలిగిస్తారో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS