ప్యాన్ ఇండియా పేరు చెప్పి, తెలుగు సినిమా స్థాయి ఈ మధ్య చాలా పెరిగింది. బడ్జెట్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ మోస్తరు చిన్న సినిమాలకైనా బడ్జెట్ బాగానే ఖర్చు చేస్తున్నారు. అయితే, ఇకపై ఆ లెక్కలకు చెల్లు చీటీ పడబోతోందనిపిస్తోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమ చాలా దెబ్బ తిన్నది. అనుకున్న షెడ్యూల్స్ ఆగిపోయి, అనుకున్న టైమ్‌కి సినిమా రిలీజ్‌లు ఆగిపోయి తీరని నష్టాన్ని కలిగించింది. దాంతో ఇకపై సినిమా బడ్జెట్ విషయంలో ఆలోచనలు జరుగుతన్నాయట.
బడ్జెట్ బాగా తగ్గించుకోవాలనుకుంటున్నారట. అదే సమయంలో రెమ్యునరేషన్స్ కూడా తగ్గిపోతాయని అంటున్నారు. అలాగే కాస్ట్ కటింగ్స్ కూడా. సో సినీ ఇండస్ట్రీకి ఇకపై గడ్డు కాలం మొదయ్యిందనే చెప్పాలి. ఒక్క టాలీవుడ్‌కే కాదు, అన్ని భాషల్లోనూ సినీ ఇండస్ట్రీ భవిష్యత్ ఇలాగే ఉండబోతోందని మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఇది ఊహించని పరిణామమే. ప్రపంచాన్ని వణికించి వేస్తున్న కరోనా కారణంగానే ప్రజలకు వినోదాన్ని పంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న సినీ పరిశ్రమకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది.