టీజర్‌ టాక్‌: ఇంట్రెస్టింగ్‌గా 'బ్రోచేవారెవరురా'.!

మరిన్ని వార్తలు

శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మరో వైవిధ్యమైన చిత్రం 'బ్రోచేవారెవరురా'. శ్రీ విష్ణు సినిమాలంటేనే ఏదో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ అందులో ఉంటుందనే భావన ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. ఆ నమ్మకాన్ని అస్సలు వమ్ము చేయకుండా, శ్రీ విష్ణు నటించిన 'బ్రోచేవారెవరురా' టీజర్‌ విడుదలైంది. టీజర్‌లో శ్రీవిష్ణుతో పాటు రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి క్యారెక్టర్లను పరిచయం చేశారు. అలాగే హీరోయిన్‌ నివేదా థామస్‌ క్యారెక్టర్‌నీ పరిచయం చేశారు. 

 

'నేను ప్రిన్సిపల్‌ కూతుర్ని.. అని నివేదా చెప్పిన డైలాగ్‌కి తెలుసన్నట్లుగా శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌ వెర్షన్‌, యూత్‌కి కనెక్ట్‌ అవుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, ఏదో చెప్పబోతున్నాడనిపిస్తోంది శ్రీవిష్ణు ఈ సినిమా ద్వారా. ఈ క్యారెక్టర్స్‌తో పాటు, సైమల్‌టేనియస్‌గా సత్యరాజ్‌, నివేదా పేతురాజ్‌ స్టోరీని కూడా కనెక్ట్‌ చేశారు. రీల్‌ లైఫ్‌ డైరెక్టర్‌, హీరోయిన్‌ పాత్రల్లో వీరిద్దరూ కనిపిస్తున్నట్లు టీజర్‌ ద్వారా అర్ధమవుతోంది. వీరి మధ్య సంభాషణలూ ఆశక్తికరంగా కట్‌ చేశారు. 

 

'మనకు డబ్బులైతే కావాలి.. ఈజీగా పనైపోవాలి.. కానీ మనం అని ఎవ్వరికీ తెలీయకూడదు..' అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌ టీజర్‌లో ఆకట్టుకుంటోంది. 'వగలాడీ.. వగలాడీ..' అంటూ సాగే వివేక్‌ సాగర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. తక్కువ నిడివిలోనే, టీజర్‌తో చాలా చాలా ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు. లుక్స్‌ పరంగా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు ఈ సినిమాలో శ్రీవిష్ణు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని జూన్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS