కంగనా రనౌత్, క్రిష్ వివాదంలోకి నందమూరి బాలకృష్ణ పేరు కూడా వచ్చేసింది. గత కొన్ని రోజులుగా అటు క్రిష్, ఇటు కంగనా... ఇద్దరూ ఒకరిపై మరొకరు ఇంతెత్తున్న లేస్తున్న సంగతి తెలిసిందే కదా?! ఎవరు ఎక్కడ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా.. మరొకరి పేరుని బజారుకీడుస్తున్నారు. ఇప్పుడు కంగనా రనౌత్ వంతు వచ్చింది. 'మహానాయకుడు' ఇటీవలే విడుదలై ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది కదా? ఇక కంగనా రెచ్చిపోయింది.
''ఇప్పుడు చెప్పండి... నాపై నిందలు వేసి రాబందుల్లా పీక్కుని తిన్నారు కదా? మహానాయకుడు రిపోర్ట్ తెలిసింది. క్రిష్‌ని నమ్మిన బాలయ్యసార్‌ని చూస్తుంటే నాకు జాలిగా ఉంది. పంపిణీదారులకు తీవ్ర నష్టం వచ్చిందట కదా? రికవరీ అయ్యే ఛాన్సే లేదంటున్నారు..'' అంటూ మహానాయకుడిపై సానుభూతి ప్రకటించింది కంగనా. క్రిష్‌తో పాటు కొన్ని మీడియా వర్గాలు కూడా ‘మణికర్ణిక’పై దుష్ప్రచారం చేశాయి.
మన స్వాతంత్ర సమరయోధులు దయాగుణం లేని ఇలాంటి మూర్ఖుల కోసం రక్తం చిందినందుకు నాకు చాలా బాధగా ఉంది’ అంటూ ముక్తాయించింది. ఇప్పటి వరకూ క్రిష్, కంగనా రనౌత్ మాటలతోనే యుద్ధం చేసేసుకున్నారు. ఇప్పుడు బాలయ్య పేరునీ, సినిమానీ ప్రస్తావించేవరకూ వెళ్లింది కంగనా. అసలే ఈ సినిమా ఫ్లాప్ అయ్యిందన్న బాధలో ఉన్న చిత్రబృందానికి కంగనా వ్యాఖ్యలు మరింత బాధిస్తాయేమో..!