మంచు మనోజ్‌ నెక్ట్స్‌ ఏంటీ?

By iQlikMovies - June 08, 2018 - 14:54 PM IST

మరిన్ని వార్తలు

స్టార్‌ హీరో అనిపించుకోకపోయినా, సమ్‌థింగ్‌ స్పెషల్‌ హీరో అనిపించుకుంటున్నాడు మంచు మనోజ్‌. మనోజ్‌ నుండి ఏ సినిమా వచ్చినా, అందులో ఏదో ఒక స్పెషాలిటీ ఉండి తీరాల్సిందే. మంచి నటుడు. మంచి డాన్సర్‌. మంచి ఫైటర్‌. ఇలా ఒక్కటేమిటీ చాలా రకాల టాలెంట్స్‌ ఉన్నాయి మంచు మనోజ్‌లో. ఈ సంగతి ఎవర్ని అడిగినా చెబుతారు. 

ప్రస్తుతం మంచు మనోజ్‌ ఏం చేస్తున్నాడబ్బా అంటే, ఓ ఇంట్రెస్టింగ్‌ స్టోరీ కోసం ఎదురు చూస్తున్నాడట. ఇంతవరకూ తాను పోషించని పాత్రలో కనిపించాలని ఉబలాటపడుతున్నాడట. అయితే అలాంటి స్టోరీలు ఉంటాయా? అంటే ఉందంటున్నాడు మంచు మనోజ్‌. ఆల్రెడీ ఆ తరహా స్టోరీ ఒకటి మంచు మనోజ్‌ చేతికి చిక్కిందట. ఆ వివరాలు త్వరలోనే చెబుతానంటున్నాడు మనోజ్‌. ఓ దశలో సినిమాలకు గుడ్‌బై చెప్పేయాలనుకున్నాడు మంచు మనోజ్‌. 

కానీ తర్వాత కొనసాగాల్సి వచ్చింది. విభిన్న కథలను ఎంచుకునే హీరోగా మంచు మనోజ్‌కి చాలా మంది అభిమానులున్నారు. ఆ అభిమానులే మనోజ్‌ నుండి కమర్షియల్‌ సినిమాలను కూడా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. వారి ఎక్స్‌పెక్టేషన్స్‌ని వమ్ము చేయకుండా, మనోజ్‌ కమర్షియల్‌ యాంగిల్‌ని కూడా టచ్‌ చేస్తానంటున్నాడు. కానీ తన ఫస్ట్‌ అండ్‌ బెస్ట్‌ ఆప్షన్‌ మాత్రం డిఫరెంట్‌ జోనర్‌ మూవీస్‌కే అంటున్నాడు మంచు మనోజ్‌. 

చూడాలి మరి మంచు మనోజ్‌ నుండి రాబోయే ఆ సర్‌ప్రైజింగ్‌ అండ్‌ ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌ మూవీ ఏంటో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS