సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో లీడ్ రోల్ అయిన లక్ష్మీ పార్వతి పాత్ర కోసం ఓ కన్నడ నటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వర్మ తన సినిమాల్లో పాత్రలను సహజ సిధ్దంగా ఉండేలా చూసుకుంటారు. ఆ కోవలోనే ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కోసం ఓ కన్నడ నటిని టాలీవుడ్‌కి తీసుకొస్తున్నారట. ఆమె పేరు ఏంటీ.? ఎవరా కన్నడ నటి.? అనే వివరాలు వర్మ ఇంకా రివీల్ చేయలేదు. కానీ, త్వరలోనే ఆ వివరాలు ప్రకటించనున్నారట.
ఇక ఈ సినిమా షూటింగ్ చాలా చాలా ఫాస్ట్‌గా జరిపేయనున్నారట. మామూలుగానే వర్మ సినిమాలు త్వరగా కంప్లీట్ అవుతుంటాయి. అయితే వర్మ తన గత చిత్రాలతో పోల్చితే అతి తక్కువ టైంలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రికార్డుకెక్కినా ఆశ్చర్యపోనంతగా ఈ సినిమాని పూర్తి చేయనున్నారనీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం కేవలం వర్మ 35 రోజులు మాత్రమే టైం తీసుకోనున్నారట.
ఇదిలా ఉంటే, ఈ సినిమా కోసం వర్మ ఎంచుకున్న కాన్సెప్ట్ స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ ఇచ్చిన తర్వాతి పరిణామాలేంటీ.? అనే అంశమే. ఆ అంశం మీదనే పూర్తిగా ఫోకస్ చేస్తూ ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. అయితే లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక, ఆయన జీవితంలో వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే విషయంలో చాలా వరకూ ప్రజలకూ తెలిసిందే. అయితే వర్మ తన సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారు.? అనేదానిపై అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.