ఆ సూప‌ర్ హిట్ కి సీక్వెల్ ఉందా? లేదా?

మరిన్ని వార్తలు

కార్తీ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిల‌బ‌డిపోయింది `ఖైదీ`. లోకేష్ క‌న‌గ‌రాజ్‌... ఈ సినిమాతో త‌న స్టామినా చూపించాడు. ఒక్క‌సారిగా పెద్ద హీరోల దృష్టిలో ప‌డిపోయాడు. `ఖైదీ` స‌మ‌యంలోనే సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు కార్తీ. ఇది సీక్వెల్ కి అనువైన క‌థ కూడా. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ... సీక్వెల్ కి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. లోకేష్ త‌న సినిమాల‌తో తాను బిజీ. ఇటు కార్తీ కూడా అంతే. ప్ర‌స్తుతం `సుల్తాన్` ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న కార్తీకి `ఖైదీ` సీక్వెల్ గురించి మాట్లాడితే.. సానుకూలంగా ఏమీ స్పందించ‌లేదు.

 

`చూద్దాం` అన్న‌ట్టే మాట్లాడుతున్నాడు. నిజానికి `ఖైదీ` పూర్త‌యిన వెంట‌నే `ఖైదీ 2`నీ మొద‌లెట్టాల‌న్న‌ది కార్తి ఆలోచ‌న‌. కానీ.. లోకేష్ కొత్త ప్రాజెక్టుల్ని ఒప్పేసుకున్నాడు. దాంతో.. కార్తీ కూడా ఇప్పుడు `ఖైదీ 2`పై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని, కావాల‌నే లోకేష్ కి దూరంగా ఉంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కార్తీ, లోకేష్ మ‌ధ్య‌... కమ్యునికేష‌న్స్ అంత బ‌లంగా లేవ‌ని, అందుకే ఈ సీక్వెల్ గురించి ఇద్ద‌రూ మాట్లాడడ‌డం లేద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు, అక్క‌డి మీడియా వ్యాఖ్యానిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS