తెలుగులో ఓ ఊపు ఊపేసిన సినిమా 'ఆర్‌ఎక్స్ 100'. యూత్ కంటెన్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ సంచనల విజయం అందుకుంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కొల్లగొట్టేసింది. ఈ సినిమాతో హీరో, హీరోయిన్లుగా పరిచయమైన కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌కి మంచి క్రేజ్ వచ్చింది ఈ సినిమాతో. వర్మ శిష్యుడు అజయ్ భూపతి తనదైన టేకింగ్‌తో రూపొందించి, ఈ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ఇకపోతే ఈ సినిమాని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు. మనీష్ లుథారియా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అహాన్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇక తెలుగులో హాట్ హాట్ గ్లామర్‌తో యూత్‌కి స్పెషల్ కిక్ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్ పాత్రను తారా సుతారియా పోషిస్తోంది. బాలీవుడ్‌లో తారా సుతారియా అంటే ఓ సంచలనమే. గ్లామర్ పాత్రలకు అమ్మడు పెట్టింది పేరు. ఇక పాయల్ రాజ్‌పుత్ పాత్రలో తారా సుతారియా అంటే అంతకు మించిన ఘాటు మసాలా సీన్స్ పుష్కలంగా లభించడం పక్కా.
ఇక బాలీవుడ్ మూవీ అన్నాక ముద్దు సీన్లకు కొదవే ఉండదు. ఈ మధ్య తెలుగులో యూత్‌ని విపరీతంగా కనెక్ట్ చేసి, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన తెలుగు సినిమాలు వెంటనే బాలీవుడ్‌లో రీమేక్స్‌కి సిద్ధమైపోతున్నాయి. ఆల్రెడీ 'అర్జున్‌రెడ్డి' సినిమా 'కబీర్‌సింగ్' టైటిల్‌తో హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 'ఆర్‌ఎక్స్ 100' సినిమా. ఈ సినిమాని అదే టైటిల్‌తో హిందీలో రూపొందించాలనుకుంటున్నారనీ బాలీవుడ్ వర్గాల సమాచారమ్.