సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, సీనియర్ నటుడు డైలాగ్ కింగ్ మోహన్‌బాబు తాజాగా భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అసలింతకీ మోహన్‌బాబు వర్మతో ఏం మాట్లాడారు.? వర్మ మోహన్‌బాబుకు ఏం చెప్పారు.? అనే ప్రశ్నలు కలవరపెడుతున్నాయి. ఆ రోజు ఆ వెన్నుపోటు సమయంలో ఏం జరిగిందో నాకు తెలుసు అంటూ మోహన్‌బాబు గతంలో పలు సందర్భాల్లో తెలిపిన సంగతి తెలిసిందే.
ఇటీవల విద్యాసంస్థల ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలో జరిగిన రగడపై మోహన్‌బాబు చంద్రబాబును విమర్శించారు. ఈ సంగతి పక్కన పెడితే, వర్మ భేటీలో నిజాలను తెలుసుకున్నాను అంటూ వర్మ తాజాగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆ నిజాలేంటీ.? మామూలుగా అయితే వర్మకీ, మోహన్‌బాబుకీ మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. మోహన్‌బాబు ఫ్యామిలీతో రామ్‌గోపాల్ వర్మ గతంలో మూడు చిత్రాలను తెరకెక్కించారు.
ఒకవేళ భవిష్యత్ సినిమాల విషయమై చర్చించారా.? లేక వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా గురించి చర్చించారా.? లేక ఇంకేదైనా చర్చా.? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని వ్యతిరేకిస్తూ విడుదల ఆపేయాలని కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వర్మకు అనుకూలంగానే కోర్టు తీర్పు రావడం, సెన్సార్ బోర్డ్ క్లీన్ యు సర్టిఫికెట్ ఇవ్వడంతో అనుకున్న టైంకే అంటే ఈ నెల 29న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్‌కి ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయినట్లే.