అడల్ట్ కంటెన్ట్ కాస్తా యూత్ కంటెన్ట్‌గా రూపాంతరం చెందిందనాలేమో. 'అర్జున్‌రెడ్డి'తో మొదలైన ఈ ఫార్ములా అలా అలా పెరిగి పెరిగి పెద్దదైంది. చిన్న సినిమాల సక్సెస్ ఫార్ములా అయ్యింది. అదేనండీ మూతి ముద్దుల పండగ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. లేటెస్ట్‌గా 'హిప్పీ' టీజర్ విడుదలైంది. టీజర్‌లో ఏముందయ్యా అంటే.. ఇంకేముంటుంది. అమ్మాయిల గ్లామర్, మూతి ముద్దుల హంగామా.
అక్కడక్కడా కొన్ని యాక్షన్ సీన్లున్నాయనుకోంది. కానీ యూత్‌కి కనెక్ట్ అయ్యేది మాత్రం ఘాటు ఫార్ములానే కదా. ఇకపోతే 'హిప్పీ' విషయానికి వస్తే, 'ఆర్‌ఎక్స్ 100'తో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో అర్జున్‌రెడ్డిని మించిపోయిన యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. దిగంగనా సూర్యవన్షీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో జె.డి. చక్రవర్తి ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు.
లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన టీజర్ వెన్నెల కిషోర్, కార్తికేయ సంభాషణలతో స్టార్ట్ అయ్యింది. నేను ప్లేబోయ్‌ని కాదు, లవర్ బోయ్‌ని అంటూ హీరో చెప్పే డైలాగ్ టీజర్‌కి హైలైట్ అయ్యింది. మొత్తానికి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ప్లే బోయ్‌లానే పరిచయం చేశారు. మధ్యలో బాక్సర్‌గా ఓ యాక్షన్ సీన్‌ని చూపించారు. చిట్టచివరిలో స్విమ్మింగ్ పూల్‌లో హీరోయిన్‌తో హీరో ఘాటు లిప్‌లాక్.. కాక రేపేస్తోంది. అదీ సంగతి. ఈ ఘాటు రొమాన్స్ మరోసారి కార్తికేయకు హిట్ ఇస్తుందా.? చూడాలిక. టి.ఎన్. క్రిష్ణ 'హిప్పీ'కి దర్శకత్వం వహించారు.