ఇటీవల 'మహానటి' సినిమాతో తిరుగులేని సక్సెస్‌తో పాటు, హీరోయిన్‌గా మంచి నటిగా మరో మెట్టు పైకి ఎక్కింది అందాల భామ కీర్తిసురేష్. అయితే ఆమె కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడుతుందన్న 'అజ్ఞాతవాసి' సినిమాపై కెరీర్‌కి ఉపయోగపడకపోవడం సరికదా, పెద్ద మచ్చ తీసుకొచ్చిందని అందరూ అనుకుంటున్నారు.
కానీ 'అజ్ఞాతవాసి' విషయంలో కీర్తి సురేష్ అలా ఫీలవడం లేదట. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్‌తోనే మనం ఎక్కువ విషయాలు నేర్చుకుంటాం. అలా 'అజ్ఞాతవాసి' ద్వారా నేను చాలా నేర్చుకున్నానంటోంది కీర్తి సురేష్. ప్రతీ సినిమా సక్సెస్ అవ్వాలనే కష్టపడి నటిస్తాం. అయితే సక్సెస్ అనేది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. ఓ సక్సెస్‌ని అందుకున్నామంటే, దాని వెనక చాలా కారణాలు, అనేక రకాల కష్టాలుంటాయి. ఎంతైనా ఫెయిల్యూర్‌ని చూసి కుంగిపోకూడదు, మరింత ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి అంటూ జీవిత సత్యాలను వల్లె వేస్తోంది ముద్దుగుమ్మ కీర్తిసురేష్.
ఏది ఏమైనా కీర్తిసురేష్ 'అజ్ఞాతవాసి' ఎఫెక్ట్‌కి కూసింత భయపడుతోందనే అంటున్నాయి ఫిలిం వర్గాలు. ప్రస్తుతం తెలుగులో కొత్త సినిమాలు ఒప్పుకోకపోవడానికి కారణం కూడా అదేనంటున్నారు. అంతేకాదు, 'మహానటి'తో అంతులేని ప్రశంసలు దక్కించుకున్న కీర్తి సురేష్ తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో అస్సలు తొందరపడకుండా, ఆచి తూచి వ్యవహరిస్తోందట.
ప్రస్తుతం తమిళంలో కీర్తి రెండు చిత్రాల్లో నటిస్తోంది.