కొత్త సినిమా షురూ చేసిన కీర్తిసురేష్‌.!

By iQlikMovies - January 10, 2019 - 18:15 PM IST

మరిన్ని వార్తలు

'మహానటి' తర్వాత కీర్తి సురేష్‌ తెలుగులో సినిమా చేయలేదు. ఒప్పుకోలేదు కూడా. తమిళంలో వరుస చిత్రాలతో ఆకట్టుకుంది. 'సర్కార్‌', 'పందెం కోడి 2', 'సామి 2' అనువాద చిత్రాలుగా తెలుగులో విడుదలయ్యాయి. ఆ రకంగా 'మహానటి' సినిమా తర్వాత డైరెక్ట్‌ తెలుగు సినిమా చేయకపోయినా కీర్తి సురేష్‌ని జనం మర్చిపోలేదు. 

 

అయితే లేటెస్టుగా కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా తెలుగులో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని మహేష్‌ కోనేరు నిర్మిస్తున్నారు. నరేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కళ్యాణీ మాలిక్‌ సంగీతమందిస్తున్నారు. 'మహానటి' మాదిరిగా ఇది కూడా లేడీ ఓరియెంటెడ్‌ మూవీనే కావడం విశేషం. 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్‌ కీర్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. 

 

మహానటి సావిత్రిని మరిపించింది కీర్తిసురేష్‌ ఆ పాత్రలో. ఆ సినిమా తర్వాత వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగానే తెలుగులో సినిమాకి ఒప్పుకోలేదట. ఏ సినిమా చేసినా డెడికేషన్‌తో చేయాలన్నదే కీర్తిసురేష్‌ ఆటిట్యూడ్‌. సో తమిళంలో సినిమాలు పూర్తి చేసి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టింది. ఇక వరుసగా తెలుగులో ఇంకొన్ని సినిమాలు చేస్తానంటోంది. చూడాలి మరి కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ సినిమా ఆమెకు ఎంతటి గుర్తింపు తీసుకురానుందో. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS