'కేజిఎఫ్' విడుదల తేదీ ఖరారు చేసిన అమెజాన్ ప్రైమ్

మరిన్ని వార్తలు

ఇటీవల విడుదలైన చిత్రాల్లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన చిత్రం 'కేజిఎఫ్'. కన్నడ రాక్ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమెజాన్ సొంతం చేసుకుంది. గత కొన్ని రోజులు నుండి, త్వరలో కేజిఎఫ్ సినిమా అన్ని భాషల్లోనూ అందుబాటులోకి రానుంది అంటూ.. సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ ని ఊరిస్తూ వచ్చారు అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారులు. 

 

ఫాన్స్ తమ హీరోల సినిమాల కోసం ఏదైనా చేయటానికి సిద్ధపడతారు. అలాగే, తమ సహనాన్ని పరీక్షిస్తూ వచ్చిన అమెజాన్ పై విరుచుకుపడ్డారు అభిమానులు. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయిస్తారు అంటూ కామెంట్స్ ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేసారు. అయినా సరే అసలు విషయం చెప్పకుండా, ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పెట్టి 5000 రీట్వీట్స్ వచ్చిన వెంటనే కేజిఎఫ్ ని విడుదల చేస్తాం అంటూ టార్గెట్ ఇచ్చారు. 

 

దాంతో.. అందరి హీరోల ఫాన్స్ ఏకమై ఒక్కసారిగా తమ ప్రతాపాన్ని చూపించారు. కేవలం 37 నిమిషాల్లో 7000 రీట్వీట్లు తెప్పించారు. ఈ సంఘటనతో అమెజాన్ ప్రైమ్ అధికారులు ఖంగు తిని, కేజిఎఫ్ విడుదల తేదీని తెలియచేసారు. ఫిబ్రవరి 5వ తేదీ అనగా, రేపటి నుండి 'కేజిఎఫ్' సినిమా తమిళ, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రైమ్ యూజర్లకి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS