తాప్సీ 'హై ఓల్టేజ్‌' లుక్‌ ఇదిగో.!

మరిన్ని వార్తలు

2013లో భారత్‌ చేపట్టిన 'మంగళయాన్‌ మిషన్‌' నేపధ్యంగా తీసుకుని బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతోంది. అదే 'మిషన్‌ మంగళ్‌'. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమా రూపొందుతోంది. జగన్‌ శక్తి దర్శకుడు. ఈ సినిమాలో తాప్సీ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలో తాప్సీ పాత్రకు సంబంధించి లుక్‌ బయటికి వచ్చింది. తాప్సీ తన ట్విట్టర్‌ ద్వారా ఈ లుక్‌ని విడుదల చేసింది. శారీలో, మెడలో మంగళసూత్రం ధరించి బాధ్యత గల గృహిణి పాత్రలో తాప్సీ నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఫస్ట్‌లుక్‌ ద్వారా. 

 

తాప్సీ పాత్ర పేరు కృతికా అగర్వాల్‌. 'మరో అందమైన ప్రయాణం పూర్తైంది.. చాలా సినిమాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలు గురువులా కలిసి పని చేసిన మ్యాజిక్‌ని రుచి చూపిస్తుంటాయి.. మంగళయాన్‌ సినిమాని చిరకాలం గుర్తుపెట్టుకుంటాను..' అని తాప్సీ ఈ లుక్‌ని పోస్ట్‌ చేసింది. తాప్సీ బ్యాక్‌ గ్రౌండ్‌లో హై ఓల్టేజ్‌ అనే బోర్దు ఉంది. తాప్సీ మాటల ద్వారా ఈ సినిమా ఆమెకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. 

 

తాప్సీతో పాటు ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, విద్యాబాలన్‌, నిత్యామీనన్‌, కీర్తి కుల్హరి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పింక్‌' మూవీతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని, బాలీవుడ్‌లో వరుసగా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోన్న తాప్సీకి ఈ 'మిషన్‌ మంగళ్‌' మరో అద్భుతమైన సినిమా అవుతుందని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS