కైరా నడుం మడతకు చెర్రీ ఆట.!

By iQlikMovies - January 07, 2019 - 10:33 AM IST

మరిన్ని వార్తలు

వినయ విధేయ రామ సినిమా నుండి లేటెస్టుగా 'రామ లవ్స్‌ సీత' సాంగ్‌ని వీడియో ప్రోమోని విడుదల చేశారు. కడుపు నిండుగా, పొట్ట లైట్‌గా అంటే ఇదేనేమో. కన్నుల పండగలా ఉందీ సాంగ్‌ ప్రోమో. చరణ్‌, కైరా డాన్సులు మరోసారి పిచ్చెక్కించేస్తున్నాయ్‌. సాహిత్యానికి తగ్గట్లుగా రామ లవ్స్‌ సీత, సీత లవ్స్‌ రామ అన్న చోట ఈ ఇద్దరూ వేసిన సిగ్నేచర్‌ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ప్రోమోని భలే కట్‌ చేశారు.

కైరా నడుం మడతతో స్టార్ట్‌ అయిన ఈ ప్రోమో రామ్‌ చరణ్‌ విల్లు స్టెప్పులు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇంతవరకూ వచ్చిన సాంగ్స్‌లో చరణ్‌, కైరా కెమిస్ట్రీ ఒకెత్తు. ఈ సాంగ్‌లో మరో ఎత్తు అన్నట్లుగా ఉంది. ఈ సాంగ్‌ ప్రోమోతో సినిమాపై అంచనాలు నెక్ట్స్‌ లెవల్‌కి చేరుకున్నాయి. ఇంతటితో ఈ ప్రమోషన్స్‌ ఆగేదే లేదట. ప్రమోషన్స్‌ విషయంలో దానయ్య ఏమాత్రం రాజీ పడబోవట్లేదట.

భారీ ఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహించనున్నారట. ఇందులో భాగంగా కైరా - చరణ్‌, భళ్లాలదేవ రానా చేసిన ఓ టీవీ షోకి గెస్ట్‌లుగా వచ్చి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సందడినంతటినీ త్వరలోనే ప్రసారం చేయనున్నారు. ఆలోగా విడుదలైన వీడియో సాంగ్‌ ప్రోమోలతో ఫ్యాన్స్‌కి కిర్రాకు పుట్టిస్తున్నారు. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS