ప్రియా కోసం స్టైలిష్ స్టార్‌.!

మరిన్ని వార్తలు

జస్ట్‌ 27 సెకన్ల వీడియోతో యావత్‌ భారతదేశాన్ని ఉర్రూతలూగించేసింది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఎన్నో సినిమాలు చేసిన ఓ స్టార్‌కి దక్కే ఇమేజ్‌ని ఒక్క రాత్రిలోనే ఈ బ్యూటీ దక్కించేసుకుంది. మలయాళంలో తెరకెక్కిన 'ఒరు అధార్‌ లవ్‌' అనే సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ పక్కన సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్‌తో ఆ సినిమా అక్కడ సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు, దేశం మొత్తం ఈ బ్యూటీ గురించి ఆరా తీసేసేలా చేసింది. 

 

అక్కడితో సోషల్‌ మీడియాలో అమ్మడికున్న ఫాలోయింగ్‌ ఇక చెప్పనే అక్కర్లేదు. ఇలా వచ్చిన క్రేజ్‌తో అమ్మడు ఆల్రెడీ బోలెడన్ని రాళ్లు వెనకేసేసుకుందిలెండి అది వేరే విషయం. అయితే ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా నటించలేదు కానీ, కమర్షియల్‌ యాడ్స్‌లో మాత్రం తెగ దున్నేసుకుంది. ఇకపోతే ఇంత క్రేజ్‌కి కారణమైన 'ఒరు అధార్‌ లవ్‌' చిత్రాన్ని సుఖీభవ సినిమాస్‌ సంస్థ తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

 

'లవర్స్‌డే' టైటిల్‌తో ఈ సినిమాని వేలంటైన్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆ క్రమంలో జనవరి 23న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారని తాజా సమాచారం. జస్ట్‌ టీజర్‌ వీడియోతోనే సంచలనాలు సృష్టించిన ప్రియా ప్రకాష్‌ వారియన్‌ని 'లవర్స్‌డే' ద్వారా తెలుగు కుర్రోళ్లు ఎలా ఆదరిస్తారో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS