తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్‌రెడ్డి' మూవీని తమిళ, హిందీ భాషల్లో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌కి ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తుండగా, తమిళ వెర్షన్ బాలా దర్శకత్వంలో రూపొందుతోంది. లేటెస్టుగా తమిళ అర్జున్‌రెడ్డి ట్రైలర్ విడుదలైంది. 'వర్మ' అనే టైటిల్‌తో రూపొందిన ఈ సినిమాలో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు.
తొలి సినిమాకే ఇలాంటి రా కంటెన్ట్ మూవీని ఎంచుకున్న ధృవ్ గట్స్‌ని మెచ్చుకొని తీరాలి. లేటెస్టుగా విడుదలైన ట్రైలర్‌లో ధృవ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లోనూ చక్కగా కనిపించాడు. యాక్టింగ్ స్కిల్స్ పరంగా విలక్షణ నటుడైన తండ్రి విక్రమ్ ప్రభావం బాగా కనిపించింది ధృవ్‌లో. 'అర్జున్‌రెడ్డి' సినిమాలో మాదిరిగానే ఘాటు రొమాంటిక్ సీన్స్, లిప్‌లాక్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ ద్వారా బాగానే హింట్ ఇచ్చేశారు.
రగ్గ్‌డ్ లుక్, ఉద్వేగాలు, ఉక్రోశాలు, ప్రేమ, విరహం ఇలా రకరకాల ఎమోషన్స్ హై పిచ్‌లో ఉంటాయి హీరో పాత్రలో. అయితే ఆ ఎమోషన్స్ అన్నింటికీ ఈ డెబ్యూ హీరో పూర్తిగా న్యాయం చేశాడో లేదో తెలియాలంటే సినిమా విడదులయ్యే వరకూ ఆగాల్సిందే. ఇక తెలుగులో సంచలన విజయం అందుకుని, విజయ్ దేవరకొండను సూపర్‌స్టార్స్ సరసన నిలబెట్టేసిన ఈ సినిమా ధృవ్‌కి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలిక.