`ఆర్.ఆర్.ఆర్`తరవాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏమిటన్నది ఫిక్స్ అయిపోయింది. కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆచార్య ముగిసిన వెంటనే.. ఈ సినిమాని కొరటాల పట్టాలెక్కించబోతున్నాడు. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఈలోగా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు కొరటాల. కథానాయికగా కియారా అద్వాణీ దాదాపుగా ఖాయమని తెలుస్తోంది.
`భరత్ అనే నేను`లో కిరాయా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కథానాయికనే కొరటాల రిపీట్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం మమ్ముట్టిని ఎంచుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ. ఇది గాసిప్ మాత్రమే. దీనిపై కొరటాల స్పందించాల్సివుంది. ఏప్రిల్ 22, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. `జనతా గ్యారేజ్` విడుదలైన తేదీ అదే. కాబట్టి సెంటిమెంట్ గా వర్కవుట్ అవుతుందని కొరటాల గట్టి నమ్మకం.