గ్లామ్‌షాట్‌: కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కైరా.!

By iQlikMovies - February 12, 2019 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

బ్లాక్‌ హాట్‌ నెట్టెడ్‌ కాస్ట్యూమ్‌లో కైరా అందాలు పిచ్చెక్కించేస్తున్నాయి. కైపెక్కించే కళ్లతో కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది. 'భరత్‌ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై క్రేజీ హీరోయిన్‌ అనిపించుకుంది. రెండో సినిమా 'వినయ విధేయ రామ' నిరాశపరిచినా మరిన్ని మంచి ఆఫర్లు కైరా కోసం ఎదురు చూస్తున్నాయి. అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ కూడా కైరా హవా కొనసాగుతోంది.

 

'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్‌ అయిన 'కబీర్‌సింగ్‌'లో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తెలుగులో త్రివిక్రమ్‌ - అల్లు అర్జున్‌ సినిమాకి కైరా పేరు పరిశీలనలో ఉంది. ఇది కాక మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఎంత బిజీ అయినా తెలుగు సినిమాలను వదలనని నొక్కి చెబుతోంది ముద్దుగుమ్మ కైరా అద్వానీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS