'సైరా నరసింహారెడ్డి' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంటోంది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివతో సినిమాని పట్టాలెక్కించనున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి స్క్రిప్టు పనులు స్టార్ట్ అయ్యాయి. ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లో కొరటాల టీమ్ బిజీగా ఉంది. ఆ క్రమంలో చిరు సరసన హీరోయిన్గా కైరా అద్వానీని అనుకుంటున్నారట. త్రిష పేరు కూడా పరిశీలనలో ఉంది.
'సైరా' కోసం నయనతారను తీసుకొచ్చారు. అలాగే ఈ సారి బాలీవుడ్ నుండి కొత్త హీరోయిన్ని తీసుకొచ్చే ఆలోచన కూడా చేస్తున్నారట. కానీ కైరాని 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన కొరటాల శివ, నా నెక్ట్స్ సినిమాలో కూడా నువ్వే హీరోయిన్ అని ఆ సినిమా టైంలోనే కైరాకి హామీ ఇచ్చారట. ఆ హామీని ఇలా తీర్చుకోనున్నారేమో.
కైరాలో బబ్లీనెస్‌తో పాటు, మెచ్యూర్డ్ లుక్స్ కూడా ఉంటాయి. అదే ఆమె నటించిన 'లస్ట్ స్టోరీస్' మూవీకి ప్లస్ అయ్యింది. 'లస్ట్ స్టోరీస్'లో గృహిణి పాత్రలో ఆమె ఇచ్చిన హావభావాలకు అందుకే అందరూ ఫిదా అయిపోయారు. సో చిరంజీవి పక్కన కైరా కరెక్ట్ జోడీ కావడం ఖాయం. అయితే ఈ సినిమా కోసం కైరాని కొద్దిగా ఒళ్లు చేయమని కొరటాల సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ గాసిప్‌లో నిజమెంతో తెలీదు కానీ, ఒకవేళ చిరంజీవి సరసన నటించే ఛాన్స్ వచ్చిందంటే కైరా పంట పండినట్లే.