నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి తెలియనిది ఎవరికి? పరిచయం అవసరం లేని పేరు. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉన్నాడు. కథానాయకుడిగా ఓ రేంజ్ చూసిన రాజేంద్ర ప్రసాద్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ బిజీ. తెరపై రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడంటే, పక్కన ఎంతటివాడైనా ఖంగు తినాల్సిందే. ప్రతీ పాత్రనీ డామినేట్ చేసి పారేయడం రాజేంద్రుడికి వెన్నతో పెట్టిన విద్య.
అయితే ఈ డామినేషన్ సెట్లోనూ చూపిస్తున్నాడన్నది టాలీవుడ్ టాక్. దర్శకుడి పనిలో, మిగిలిన నటీనటుల పనిలో రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా జోక్యం చేసుకుంటున్నాడని, ఈ వ్యవహారంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు కక్కలేక, మింగలేక అవస్థలు పడుతున్నారని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా 'మిస్ గ్రానీ' రీమేక్‌లో రాజేంద్ర ప్రసాద్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నాడని టాక్. సమంత అక్కినేని ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న చిత్రమిది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు.
సెట్లో రాజేంద్ర ప్రసాద్ డామినేషన్‌ని దర్శక నిర్మాతలు తట్టుకోలేకపోతున్నారని తెలుస్తోంది. మిగిలిన సినిమావాళ్లు కూడా రాజేంద్ర ప్రసాద్ తో షూటింగ్ అంటే భయపడుతున్నారని టాక్. పెద్ద వయసు వచ్చేసింది. పైగా సీనియర్ మోస్ట్ నటుడు.. అందుకే చాలామంది సర్దుకుపోతున్నారట. ''ఆయనంతే. ముందు నుంచీ ఇలానే ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా మారిందేం లేదు'' అని రాజేంద్ర ప్రసాద్ తో అనుబంధం ఉన్నవాళ్లు చెబుతున్నారు.