లారెన్స్‌ సినిమాలో 'భరత్‌' బ్యూటీ.!

మరిన్ని వార్తలు

డాన్స్‌ కొరియోగ్రాఫర్‌ లారెన్స్‌ హీరోగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సౌత్‌ ప్రేక్షకులకు సుపచితుడే. ఇక త్వరలో బాలీవుడ్‌నీ దున్నేయనున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన హారర్‌ కామెడీ 'కాంచన'ను హిందీలో రీమేక్‌ చేస్తుండడం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడట లారెన్స్‌ రాఘవ. ఈ సినిమాలో హీరోయిన్‌గా 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీని ఎంచుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయనీ సమాచారమ్‌. 

 

తెలుగులో రెండు సినిమాలతో క్రేజ్‌ సంపాదించిన కైరా ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా గడుపుతోంది. అర్జున్‌రెడ్డి హిందీలో 'కబీర్‌ సింగ్‌'గా రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కైరా నటిస్తోంది. మరోవైపు అక్షయ్‌ కుమార్‌తో తెరకెక్కుతోన్న 'గుడ్‌న్యూస్‌' మూవీలోనూ కైరానే హీరోయిన్‌. కరణ్‌జోహార్‌ రూపొందిస్తున్న 'కళంక్‌' మూవీలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్‌. 

 

ఇక తాజాగా 'కాంచన' కూడా కైరా ఖాతాలోనే పడనుందని బాలీవుడ్‌ కథనం. సౌత్‌లో 'కాంచన' సిరీస్‌గా రూపొందింది. ఈ సిరీస్‌ అన్నింట్లోనూ లారెన్సే హీరో. కాగా ఈ సినిమాకి మాత్రం హీరోగా అక్షయ్‌కుమార్‌ని తీసుకున్నాడట. బాలీవుడ్‌లో అక్షయ్‌ కెరీర్‌ జోరు మీదుంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. అక్షయ్‌తో సినిమా అంటే తొలి సినిమాకే లారెన్స్‌ బాలీవుడ్‌లో హిట్‌ కొట్టేయడం ఖాయమన్న మాట. అలాగే బాలీవుడ్‌లో కైరా టేకప్‌ చేసిన ప్రాజెక్టులన్నీ పోజిటివ్‌ బజ్‌ ఉన్న ప్రాజెక్టులే కావడం విశేషం. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS