బాక్సాఫీస్‌కి ఎగ్జామ్స్‌ ఫీవర్‌... కళ్యాణ్ రామ్ సినిమాకి అదే ప్లస్

మరిన్ని వార్తలు

2019 కొత్త సంవత్సరంలో సరికొత్తగా అలరించే సినిమాలు వస్తాయని ఉత్సాహంగా ఎదురుచూసిన సినీ అభిమానులకు.. తొలి రెండు నెలల్లోనూ నిరాశే ఎదురయింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన పెద్ద హీరోల  చిత్రాల్లో ఒక్క 'ఎఫ్2' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా, రామ్ చరణ్ 'వినయ విదేయ రామ', 'ఎన్టీఆర్ కథానాయకుడు' మరియు అఖిల్ 'మిస్టర్ మజ్ను' బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఆ తర్వాత రిలీజ్ అయిన దేవ్, లవర్స్ డే, 'ఎన్టీఆర్ మహానాయకుడు', మిఠాయి... చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు మూడో నెల కూడా వచ్చేసింది. అయినా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ విడుదలకు సిద్ధంగా లేవు. 

 

ప్రస్తుతం.. బాక్సాఫీస్ కి ఎగ్జామ్స్ ఫీవర్ పట్టుకుంది. పరీక్షల సీజన్ కావటంతో కొత్త చిత్రాలను విడుదలచేసేందుకు నిర్మాతలెవరు దైర్యం చేయలేకపోతున్నారు. పరీక్షల సీజన్ కావటంతో కొత్త చిత్రాలను విడుదలచేసేందుకు నిర్మాతలెవరు దైర్యం చేయలేకపోతున్నారు. ఉన్న సినిమాలన్నింటినీ మార్చి 3వ వారం వరకు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో.. ఈ వారమే కాకుండా వచ్చే శుక్రవారం కూడా కొత్త సినిమాలు ఏవీ రావనే చెప్పాలి. తాజాగా విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ 118 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ తో నడుస్తుంది. 

 

సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది. ఇప్పటికే వసూళ్ల పరంగా బ్రేక్ ఈవెన్ స్థాయికి చేరువలో ఉన్న ఈ సినిమాకి మరో రెండు వారాలు తిరుగు లేదనే అనుకోవచ్చు. కాగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ కావటంతో.. ఈ సినిమా కోసం ప్రేక్షకాభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

దీంతోపాటు, యంగ్ హీరో సుమంత్ అశ్విన్- నందిత శ్వేతల హారర్ ఎంటర్టైనర్ 'ప్రేమ కథా చిత్రమ్2' మరియు అల్లుశిరీష్ నటించిన ఏబీసీడీ చిత్రాలు కూడా ఆ రోజే విడుదల కానున్నాయి. ఈ సినిమాల విడుదలతో సమ్మర్ హడావిడి మొదలుకానుంది. పెళ్లి తరువాత సమంత- నాగ చైతన్య జంటగా నటించిన 'మజిలీ' చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది. ఇవే కాకుండా, నాని కొత్త చిత్రం 'జెర్సీ' మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమాలు కూడా ఏప్రిల్ లోనే విడుదల కానున్నాయి. చూడాలి మరి, సమ్మర్ లో అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల గలగలలు వినిపిస్తాయేమో..!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS