చిరంజీవి సినిమాలో కైరా అద్వానీ.?

మరిన్ని వార్తలు

చిరంజీవి - కొరటాల సినిమా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌గా మారింది. ఇటీవలే 'సైరా' షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న చిరంజీవి కొరటాల సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రేపో మాపో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన స్టెప్పులేసే ముద్దుగుమ్మ కోసం వేట మొదలైంది. ఇప్పటికే పలువురు పేర్లు పరిశీలనకు వచ్చాయి. వారిలో అనుష్క పేరు కూడా ఉంది. కానీ, అంతకన్నా ప్రముఖంగా కైరా అద్వానీ, రకుల్‌ ప్రీత్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

 

రకుల్‌ ప్రీత్‌ కన్నా, కైరాకే ఎక్కువ ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. రీ ఎంట్రీలో చిరంజీవి కొడుకు చరణ్‌తో నటించిన హీరోయిన్‌ కాజల్‌ని రిపీట్‌ చేశాడు. ఈ సినిమాలోనూ అదే ప్రిఫరెన్స్‌ ఇవ్వనున్నాడనీ సమాచారమ్‌. ఆ లిస్టులో రకుల్‌, కైరా ఇద్దరూ ఉంటారు. అయితే, క్రేజ్‌ని దృష్టిలోకి తీసుకున్నా, కొరటాలతో యాంగిల్‌ నుండి చూసినా, కైరాకే ఆ ఛాన్స్‌ ఎక్కువగా ఉందనిపిస్తోంది. కొరటాలతో 'భరత్‌ అనే నేను' సినిమా కోసం ఆల్రెడీ కైరా పని చేసిన సంగతి తెలిసిందే. సో అన్నీ కుదిరితే, కెరీర్‌లో ఇంత తక్కువ టైంలోనే మెగాస్టార్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం కైరా దక్కించుకోనుందన్న మాటే.

 

ఈ సినిమాలో చిరంజీవి స్లిమ్‌గా కనిపించడంతో పాటు, డాన్సులూ, కమర్షియల్‌ ఫైట్లు ఇరగదీసేస్తారట. కొరటాల సినిమా అంటే హీరోయిజం ఏ రేంజ్‌లో ఉంటుందో ఆల్రెడీ 'శ్రీమంతుడు', 'భరత్‌ అనే నేను' సినిమాల్లో మహేష్‌బాబును చూసేశాం. మెగాస్టార్‌ అంటే అంతకు మించే ఉంటుంది. కానీ తక్కువ మాత్రం కాదు. ఇదో పొలిటికల్‌ థ్రిల్లర్‌ అనే ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు కొరటాల సినిమాలంటే ఎలాగూ అందులో సోషల్‌ మెసేజ్‌ ఖచ్చితంగా ఉంటుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS