కింగ్‌ నాగ్‌.. అఖిల్‌కి అన్నయ్యే కదా.!

మరిన్ని వార్తలు

కింగ్‌ నాగార్జున 'మన్మథుడు' పాత్రలో మళ్ళీ అదరగొట్టేయబోతున్నాడు. 'మన్మథుడు-2' సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన స్టిల్స్‌ బయటకొచ్చాయి. స్టిల్స్‌ చూస్తే ఎవరైనా నాగచైతన్యకీ, అఖిల్‌కీ నాగార్జున తండ్రి అని అనుకోరు. ఈ ముగ్గురూ అన్నదమ్ములేనేమోనన్న భావన కలుగుతుంది. అంతలా నాగార్జున మేకోవర్‌ జరిగింది. 

 

దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌కే ఈ క్రెడిట్‌ అంతా ఇచ్చేయాలా? ఏమోగానీ, ఫిట్‌నెస్‌ విషయంలో నాగార్జున సూపర్బ్‌. ఆయనకు సాటి ఇంకెవరూ రారంతే. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య బాగా బక్క పలచగా తయారైంది. అయితేనేం, అంతకు మించి సన్నబడిపోయాడు నాగార్జున. స్లిమ్‌ లుక్‌లో నాగార్జున కన్పిస్తోంటే, ఆ పక్కన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెర్‌ఫెక్ట్‌గా సూటయిపోయింది. వయసు అనేది జస్ట్‌ నెంబర్‌ మాత్రమేనని స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు చాలా సందర్భాల్లో చెప్పారు. 

 

ఆ జీన్స్‌ ప్రభావమో ఏమోగానీ, నాగార్జున ఆరు పదుల వయసులో కూడా అచ్చం పాతికేళ్ళ కుర్రాడిలా కన్పిస్తున్నారు. ఈ గెటప్‌లో నాగ్‌ పక్కన అఖిల్‌, నాగచైతన్య కన్పిస్తే.. వాళ్ళిదరికీ నాగార్జున చిన్న తమ్ముడిలా కన్పిస్తారేమో.! అతిశయోక్తిలా అన్పిస్తున్నా.. ఇది నిజంలానే అన్పిస్తోంది. విజయభాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన 'మన్మధుడు' చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. అంతకు మించిన విజయం 'మన్మథుడు-2'తో నాగ్‌ అందుకోబోతున్నాడనడానికి ఈ ఫొటోలు ఎగ్జాంపుల్‌గా చూపించేయొచ్చేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS