సన్నీలియోన్‌ని మించిపోయిన రకుల్‌.!

By Inkmantra - April 26, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ హాట్‌ భామ అంటే ముందుగా గుర్తొచ్చేది సన్నీలియోన్‌ పేరే. హాట్‌నెస్‌లో అంతలా కేక పుట్టించేసింది సన్నీ. అయితే సన్నీలియోన్‌ హవా ఇప్పుడు బాలీవుడ్‌లో కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ ఆ ప్లేస్‌ని మన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఫుల్‌ ఫిల్‌ చేసేస్తుందా.? అంటే అవుననే అనిపిస్తోంది ఆమె నటించిన తాజా చిత్రం 'దే దే ప్యార్‌ దే' ప్రమోషన్స్‌ చూస్తుంటే. మొన్న విడుదలైన 'దేదే ప్యార్‌ దే' ట్రైలర్‌లో రకుల్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, ఇక వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమా నుండి ఓ సాంగ్‌ ప్రోమో విడుదల చేశారు. 

 

 

ఈ ప్రోమోలో రకుల్‌ని చూస్తుంటే, అందరికీ సన్నీలియోన్‌ గుర్తుకొస్తోంది. ఇదే సాంగ్‌లో సీనియర్‌ నటి టబు కూడా డాన్స్‌ చేసింది. కానీ టుబుని సాంప్రదాయ దుస్తుల్లో చూపించి, రకుల్‌ని మాత్రం బీభత్సంగా ఎక్స్‌పోజ్‌ చేయించారు. కథ పరంగా 50 ఏళ్ల వ్యక్తికి టీనేజ్‌ లవర్‌గా నటిస్తోంది రకుల్‌ ఈ సినిమాలో. ఏజ్‌ బార్‌ అంకుల్‌తో శృతిమించిన రొమాన్స్‌ పండించాలి ఈ పాత్ర. అదే రకుల్‌ చేసింది. అయితే ప్రోమోస్‌లోనే రకుల్‌ ఇంత రచ్చ చేస్తుంటే, ఇక సినిమాలో ఇంకెంత రచ్చ చేసిందో అంటూ నెటిజన్లు గుస్సా అవుతున్నారు. 

 

ఎంత బాలీవుడ్‌కి వెళితే మాత్రం ఇంతలా రెచ్చిపోవాలా.? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయినా కానీ, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఇవేమీ పట్టించుకోదు కదా. తొలి సినిమా 'అయ్యారీ'పై కొండంత ఆశలు పెట్టుకుని బాలీవుడ్‌ తెరంగేట్రం చేసింది రకుల్‌. కానీ రిజల్ట్‌ బెడిసికొట్టడంతో, విమర్శల పాలైంది. ఎట్టకేలకు దొరక్క దొరక్క దొరికిన ఈ అవకాశాన్ని వీలైనంత ఎక్కువే సద్వినియోగం చేసుకోవాలి కదా. అందుకే ఎంతలా గ్లామర్‌ ఒలకబోసేందుకైనా అభ్యంతరం చెప్పలేదు కాబోలు. ఫుల్‌గా వాడేశారు దర్శక,నిర్మాతలు రకుల్‌ని. పోనీ, ఈ విచ్చలవిడి ఎక్స్‌పోజింగ్‌ అయినా రకుల్‌కి కలిసొస్తుందో లేదో. మే 17న 'దేదే ప్యార్‌దే' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS