ప్రాంతాలకతీతంగా సినిమా పరిశ్రమ ఎక్కడ ఉన్నా సరే వారు ఎదురుకుంటున్న సమస్య- పైరసీ. ఈ పైరసీ పైన వివిధ స్థాయిల్లో వివిధ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక తాజాగా ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కి ప్రముఖ రచయత కోన వెంకట్ ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన అంతర్జాలంలో ‘మూవీ రూల్స్’ అనే ఒక సైట్ గురించి మంత్రికి ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేయడం జరిగింది.
అంతేకాకుండా ఆ సైట్ స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ మంత్రికి పంపించారు, ఆ స్క్రీన్ షాట్ లో ఈ మధ్యనే విడుదలైన చిత్రాలన్ని కనిపిస్తుండడం కూడా సంచలనంగా మారింది. అయితే మంత్రిగారు ఆ ట్వీట్ పైన ఇంకా స్పందించలేదు.
ఇది పక్కకి పెడితే, పైరసీ పైన పోలీసులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు స్పెషల్ పైరసీ సెల్ పెట్టడం వంటివి మనం ఇప్పటికే చూసాము. అయితే ఈ ప్రయత్నాలు ఏవి సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి.