కమెడియన్లు హీరోలుగా అవతారమెత్తడం అనేది ఇప్పటిదేం కాదు. ఎప్పటి నుండో ఉంది. రాజబాబు, పద్మనాభం, మొదలుకొని, అలీ, బ్రహ్మానందం, బాబూ మోహన్ ఇలా తదితర అప్పటి కమెడియన్లు హీరోలుగానూ డాన్సులు, ఫైట్లూ, హీరోయిన్స్‌తో రొమాన్స్‌లు చేసి తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఈ తరం కమెడియన్స్‌లో సునీల్ తదితరులు కూడా కామెడీ రంగం నుండి వచ్చి, హీరోలుగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. లేటెస్టుగా సప్తగిరి కూడా హీరోగా తన టాలెంట్ ఏంటో చూపించాడు. తన పేరునే సినిమా టైటిల్స్‌గా పెట్టుకుని పిచ్చ పాపులరైపోయాడీ కమెడియన్ కమ్ హీరో సప్తగిరి.
అయితే తాజాగా ఇప్పుడు మరో కమెడియన్ షకలక శంకర్ కూడా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. కమెడియన్‌గా ఉన్నప్పుడు షకలక శంకర్. కానీ ఇప్పుడు ఈయన ఇప్పుడు హీరో అండీ. సో ఓన్లీ శంకర్. 'శంకర్' అనే పేరుతోనే హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. ఇంతవరకూ వచ్చిన కమెడియన్స్ కమ్ హీరోస్ అందరిలోనూ శంకర్ కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. 'జబర్దస్త్' ప్రోగ్రాంతో 'షకలక శంకర్' పేరు బాగా పాపులరయ్యింది. మెల్ల మెల్లగా సినిమాల్లో కెమడియన్‌గా బిజీ అవుతున్న తరుణంలో ఇదిగో ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. పోస్టర్స్ చూస్తుంటే అసలు కనిపించేది షకలక శంకరేనా అనే అనుమానం కలిగేలా బాడీ లాంగ్వేజ్, బాడీ ఫిజిక్‌ని మార్చేసుకున్నాడు షకలక శంకర్. 'శంభో శంకర' టైటిల్‌తో తెరకెక్కుతోందీ సినిమా.
వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఇక శంకర్ విషయానికి వస్తే, సెన్సేషనల్ డైరెక్టర్ వర్మని మక్కీకి మక్కీ దించేస్తాడు తన బాడీ లాంగ్వేజ్‌లో. అలాగే పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. 'గబ్బర్‌సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన ఎర్రతుండును తలకి కట్టుకుని చిందేస్తూ, పోస్టర్స్‌లో కనిపిస్తున్నాడు మన శంకర్. అదీ సంగతి!