పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రష్యన్ అమ్మాయి అన్నాలెజినోవాని మూడో పెళ్లి చేసుకున్నాడు. పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, రేణూదేశాయ్‌కి బెస్ట్ విషెస్ అందించాడు. ఇది ఓ రకంగా అభిమానులకు పవన్ ఇచ్చిన సందేశంగా భావించాలి.
రేణూదేశాయ్ వివాహం చేసుకోబోతోందని తెలిసి అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలెట్టారు. పవన్ నుండి విడాకులు తీసుకున్నా, రేణూదేశాయ్‌ని అభిమానులు వదినమ్మా అనే సంబోధిస్తూ, విపరీతమైన అభిమానం పెంచుకున్నారు. దాంతో ఆమె పవన్‌కి ఫిజికల్‌గా దూరంగా ఉన్నా, మెంటల్‌గా పవన్ భార్యగానే, తమకు వదినగానే భావించారు. ఆ అభిమానంతోనే ఆమె మరో వివాహం చేసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
తాజాగా ఆమె నిశ్చితార్ధం జరిగింది. ఈ సందర్భంగానే పవన్ కళ్యాణ్ ఆమెకు విషెస్ అందించారు. పవన్ సందేశంతో రేణూదేశాయ్‌కి ఫ్యాన్స్ నుండి వస్తున్న కామెంట్స్‌కి ఇక ఇక్కడితో బ్రేక్ పడాలి. పవన్ - రేణూ దంపతుల సంతానమైన అకీరా, ఆధ్యల సమక్షంలోనే రేణూదేశాయ్ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ఇదేమీ లవ్ మ్యారేజ్ కాదట. పెద్దలు కుదిర్చిన సంబంధమేనట. పవన్ నుండి విడాకులు తీసుకున్నా, ఆయన అంటే రేణూదేశాయ్‌కి ఎంతో అభిమానం. ఈ మధ్య వ్యక్తిగతంగా రేణూదేశాయ్ చాలా సమస్యలను ఎదుర్కొంది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను రెండో పెళ్లికి ప్రేరేపించారట. ఆ కోవలోనే రేణూ తిరిగి వివాహం చేసుకోవడానికి ఒప్పుకుందట.
ఇంతకీ రేణూ భర్త ఎవరనే దానిపై క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి ఈయనే రేణూ భర్త అంటూ. కానీ ఆ ఫోటోల్లో ఉన్నది రేణూ భర్త కాదు, ఆమె సోదరుడట.