అతికొద్దిమంది విలక్షణ దర్శకుల్లో క్రిష్ ఒకరు. 'కంచె'లాంటి సినిమాని క్రిష్ కాబట్టే తీయగలిగాడు. క్రిష్ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందంతే. బడ్జెట్ పరిమితులున్నా, అనుకున్న టైంకి అనుకున్న విధంగా సినిమాను పూర్తి చేయడంలో క్రిష్ స్పెషలిస్ట్. అంతేకాదు. అతి తక్కువ టైంలో సినిమాలు పూర్తి చేయడంలో క్రిష్ ఎక్స్‌పర్ట్ కూడా. ఇక తాజాగా ఎన్టీఆర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన క్రిష్ తర్వాత 'మణికర్ణిక' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
బాలీవుడ్ క్వీన్ కంగనాతో క్రిష్ తెరకెక్కించిన సినిమా 'మణికర్ణిక'. చివరి నిమిషంలో ఈ సినిమా దర్శకత్వం నుండి క్రిష్ తప్పుకోవాల్సి వచ్చింది, తెలుగులో 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రాజెక్ట్‌ని టేకప్ చేయడం కోసం. అలా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆ సినిమా కంగనా డైరెక్షన్‌లోకి వెళ్లింది. మిగిలిపోయిన ఆ అతి కొద్ది పార్ట్‌కి మాత్రమే ఆమె దర్శకత్వం వహించింది. అయితే క్రిష్ పక్కకి తప్పుకున్నాక కంగనా చాలా సీన్లు రీషూట్ చేసిందన్న సంగతి తెలిసిందే. దాంతో 'మణికర్ణిక' సినిమా నాది అని కంగనా ప్రచారం చేసుకుంది.
ఇప్పుడు క్రిష్ వచ్చి కాదు కాదు 'మణికర్ణిక' నాది అంటున్నాడు. అయితే ఇప్పుడు లాభం లేదు. క్రిష్‌కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమోషన్స్‌లో కూడా క్రిష్ ఎక్కడా వినబడలేదు. కనబడలేదు. బాలీవుడ్ ప్రమోషన్ సంగతి అటుంచితే, తెలుగు ప్రమోషన్స్‌లో కూడా క్రిష్‌ని పక్కన పెట్టేశారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది 'మణికర్ణిక'. ఈ లోగా ఏమైనా జరగొచ్చు. ఏది ఏమైనా 'మణికర్ణిక' సినిమా హిట్టైనా, ఫట్టైనా ఆ క్రెడిట్ క్రిష్ ఖాతాలోకి వెళుతుందా.? లేదా.? తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.!