సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దాంతో.... కృష్ణకు ఏమైందన్న విషయంలో అభిమానులలో ఆందోళన మొదలైంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చిత్రసీమలోని ప్రముఖులు ఆరా తీయడం మొదలెట్టారు. మీడియా కూడా కృష్ణ చికిత్స తీసుకొంటున్న ఆసుపత్రి పరసరాల్లోనే తచ్చాడుతోంది. లైవ్ కవరేజీలు అందిస్తోంది.
అయితే.. కృష్ణ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన జనరల్ చకప్ కోసమే ఆసుపత్రికి వచ్చారని, సాయింత్రానికి మళ్లీ ఇంటికి వెళ్లిపోతారని టాక్. వారానికి ఒకసారి ఆయన ఆసుపత్రికి వచ్చి చెకప్ చేయించుకోవడం మామూలే అని తెలిపాయి. శీతాకాలంలో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అవడం సహజమే.
వయసు పైబడినవాళ్లంతా సీతాకాలంలో కాస్త ఇబ్బంది పడుతుంటారు.కృష్ణ కూడా అంతే. అందుకే ఆయన ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చింది. ఏదేమైనా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.