టాలీవుడ్‌లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ప్రభాస్ పేరే చెబుతారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న - బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనేదానికంటే ఆసక్తికరమైనది. దానికి సమాధానం ఒక్క రెబల్ స్టార్ కృష్ణంరాజునే చెప్పగలరు. ఆయన ఎదురైనప్పుడల్లా.. ఈ ప్రశ్న అడగడం తప్పనిసరి. 'ఈయేడాదే ప్రభాస్ పెళ్లి' అని చాలాసార్లు ఆయన చెప్పారు కూడా.
అయితే ఇప్పుడు ప్రభాస్ పెళ్లి విషయంలో ఆయనకూ క్లూ దొరకడం లేదు. నిజానికి 2018లోనే ప్రభాస్‌కి పెళ్లి చేయాలని కృష్ణంరాజు నిర్ణయించారు. కానీ.. ప్రభాస్ మాత్రం అందుకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదని సమాచారం. కృష్ణంరాజు చాలా సంబంధాలు తెచ్చారని, కానీ ప్రభాస్ మాత్రం వాటిని పట్టించుకోలేదని, తన మనసులో ఉన్న మాట కూడా ప్రభాస్ చెప్పడం లేదని, దాంతో ప్రభాస్ తీరుపై కృష్ణంరాజు కాస్త అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది.
ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అని ఎవరైనా అడిగితే కృష్ణంరాజు కాస్త కటువుగానే సమాధానం చెబుతున్నార్ట. `ఏమో నాకేం తెలుసు..? ప్రభాస్‌నే అడగండి` అంటూ సమాధానం దాటేస్తున్నట్టు సమాచారం. పాపం.. ప్రభాస్ పెళ్లి గురించి ఆలోచించి, ఆలోచించి అలసిపోయి ఉంటారు. ప్రభాస్ మాత్రం.. తన పెళ్లి విషయంలో ఇంకా మౌనంగా ఉండడం ప్రభాస్ అభిమానులకే కాదు.. అటు కృష్ణంరాజుకీ నచ్చడం లేదన్నమాట. మరి ఈ మౌనాన్ని ప్రభాస్ ఎప్పుడు వీడతాడో చూడాలి.