సురేందర్‌ రెడ్డిని లాక్‌ చేసిన చరణ్‌.!

మరిన్ని వార్తలు

'సైరా' తర్వాత సురేందర్‌రెడ్డికి చరణ్‌తోనే సినిమా ఉండబోతోందట. 'ధృవ' టైంలోనే ఇద్దరూ కలిసి ఓ కమర్షియల్‌ సినిమా చేయాలనుకున్నారు. కానీ అనుకోకుండా 'ధృవ' ప్రపోజల్‌ వచ్చింది. 'ధృవ' తమిళ 'తనీఒరువన్‌'కి రీమేక్‌గా తెరకెక్కింది. అయితే రీమేక్స్‌ చేయడం సురేందర్‌ రెడ్డికి మామూలుగా ఇష్టముండదు. కానీ 'ధృవ' టైంలో అలా జరిగిపోయింది. లక్కీగా 'ధృవ' సక్సెస్‌ అయ్యింది. 

 

ఇక చరణ్‌ కోసం అప్పుడే ప్రిపేర్‌ చేసుకున్న స్క్రిప్టును మళ్లీ చరణ్‌తోనే తెరకెక్కించాలనుకుంటున్నాడట సురేందర్‌ రెడ్డి. చరణ్‌ కూడా అందుకు సిద్దంగా ఉన్నాడు. ప్రస్తుతం 'సైరా' సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు సురేందర్‌ రెడ్డి. 'సైరా' పూర్తయిన తర్వాత చరణ్‌, సురేందర్‌ రెడ్డి ఆ స్క్రిప్టు మీద వర్క్‌ చేస్తారట. మరోవైపు చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్నాడు. 

 

'సైరా' పూర్తయ్యేసరికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' కూడా ఓ కొలిక్కి వచ్చేస్తుంది. సో ఆ రకంగా సురేందర్‌ రెడ్డిని లాక్‌ చేసి పెట్టేశాడు చరణ్‌. నిర్మాతగా 'సైరా' సినిమా తర్వాత చిరంజీవి - కొరటాల సినిమాని పట్టాలెక్కించనున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఇలా నిర్మాతగా, హీరోగా చరణ్‌ డైరీ ఫుల్‌గా నిండిపోయింది. గ్యాప్‌ లేకుండా తండ్రి హీరోగా సొంత బ్యానర్‌లోనూ, హీరోగా తన సినిమాలతోనూ చరణ్‌ వరుసగా మెగా ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నాడన్నమాట. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS