హీరో ప్రభాస్‌కీ, జగన్ సోదరి షర్మిలకు మధ్య ఆఫైర్ ఉందని ఈ మధ్య సోషల్ మీడియాలో గాసిప్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ గాసిప్‌పై షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి కూడా తెలిసిందే. షర్మిల కంప్టైట్‌ని సీరియస్‌గా తీసుకుని పోలీసులు విచారణ చేపట్టగా ఆ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.
ఈ గాసిప్‌ని స్ప్రెడ్ చేసిన ఓ వెబ్ ఛానెల్ నిర్వాహకుడు ఈ గాసిప్‌కి ఏకంగా 2 లక్షల రూపాయలు ఆదాయం ఆర్జించినట్లు తెలుస్తోంది. అలాగే ఇలాంటి వైరల్ గాసిప్స్‌తో నమ్మశక్యం కాని రీతిలో సంపాదనను ఆర్జిస్తున్నారు చాలా మంది నెటిజన్లు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే, టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఆయనపై ఇంతవరకూ ఎలాంటి గాసిప్స్ లేవు.
డార్లింగ్‌గా అందరికీ ప్రియమైన వాడే కానీ, ఏ హీరోయిన్‌తోనూ ఎఫైర్స్ లేవు. కో స్టార్ అనుష్కతో అఫైర్ ఉన్నట్లు ప్రచారం జరిగినా అది కేవలం స్నేహం మాత్రమే అని ఇద్దరూ ఖండించడంతో ఆ గాసిప్‌కి పెద్దగా ప్రాధాన్యత రాలేదు. కానీ దురదృష్టవశాత్తూ రాజకీయంగా ప్రభాస్ - షర్మిల అఫైర్ గాసిప్ మాత్రం బాగా వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే 'సాహో' సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు తెలిపారు.