ఉప్పెనతో ఒక్కసారిగా టాప్ గేర్ వేసుకుని దూసుకొచ్చింది కృతి శెట్టి. ఇప్పుడు యంగ్ హీరో సినిమా అంటే హీరోయిన్ గా కృతి శెట్టి పేరే పరిశీలిస్తున్నారు. తన కాల్షీట్లు అందుబాటులో ఉంటే ఓకే. లేదంటే... అప్పుడు మరో హీరోయిన్ ని వెదుకుతున్నారు. కృతి చేతిలో ఇప్పుడు మూడు నాలుగు సినిమాలున్నాయి. తాజాగా మరోటి చేరింది. ఈసారి నితిన్ తో జోడీ కట్టబోతోంది కృతి.
ఎడిటర్ శేఖర్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టబోతున్నారు. తను నితిన్ కోసం ఓ కథ రాసుకున్నారు. దానికి నితిన్ కూడా ఓకే చెప్పాడు. వచ్చే యేడాది ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో కథానాయికగా... కృతిశెట్టిని ఎంచుకున్నారు. `బంగార్రాజు`లో నటించడానికి ఇటీవల కృతి సంతకాలు చేసింది. సుధీర్ బాబు, నానిల సినిమాలు పట్టాలమీద ఉన్నాయి. `ఉప్పెన` టీమ్ తోనే కృతి ఓ సినిమా చేయబోతోందని టాక్. ఇందులో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. చూస్తుంటే 2021నే కాదు... 2022 డైరీ కూడా ఫుల్ అయిపోయినట్టు కనిపిస్తోంది.