గ్లామ్‌ షాట్‌: కృతిసనన్‌ అందమైన దోపిడీ

మరిన్ని వార్తలు

'1 నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి సనన్‌, తొలి సినిమాలోనే మహేష్‌తో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసే అవకాశం దక్కించుకుందిగానీ, ఆ సినిమాతో సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో 'దోచెయ్‌' సినిమాలో నాగచైతన్య సరసన కన్పించిన సంగతి తెల్సిందే. 

 

ఇక అసలు విషయానికొస్తే, స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీ సాక్షిగా అందాల్ని ఆరబోసేసింది ఈ ముద్దుగుమ్మ తాజాగా. డబ్బూ రత్నానీ క్యాలెండర్‌ గురించి తెలియనిదెవరికి? ఆయన క్యాలెండర్‌ కోసం అందాల భామలు పోటీ పడ్తారు.. అవసరమైన మేర వస్త్ర సన్యాసం కూడా చేసేస్తారు. ఇదిగో, ఈ ఫొటో కోసం హాట్‌ హాట్‌గా ఎలా కృతి సనన్‌ అందాల్ని ఆరబోసేసిందో కదా! 

 

ఏ మాటకామాటే చెప్పుకోవాలంటే అందం, అందాల భామల అంగాంగ ప్రదర్శనలో కంటే, వారి అందమైన కళ్ళల్లోనే ఎక్కువగా కన్పిస్తుంటుంది. కళ్ళతోనే సెక్సప్పీల్‌ పండించేయడం ఎంతమందికి సాధ్యపడుతుంది చెప్పండి? అలా ఆ సెక్సీ స్పార్క్‌ని కృతి సనన్‌ ప్రదర్శించేయడం, దాన్ని డబ్బూ రత్నానీ కెమెరా క్యాప్చర్‌ చేయడం అలా జరిగిపోయాయంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS