మహేష్‌బాబు హీరోయిన్‌కి ఎట్టకేలకు ఓ హిట్టొచ్చిందండోయ్. తెలుగులో 'వన్ - నేనొక్కడినే' సినిమాతో పరిచయమైంది పొడుగు కాళ్ల సుంది కృతిసనన్. తర్వాత 'దోచేయ్' సినిమాలో నటించిందీ భామ. ఈ రెండు సినిమాలూ ఆశించిన విజయాలు అందించలేదు అమ్మడికి. దాంతో వెనకా ముందూ ఆలోచించకుండా బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కూడా అరకొరా అవకాశాలే కృతిసనన్‌ని వరించాయి.
ఇక కృతిసనన్‌కి అంత సీను, సినిమా లేదు అనుకున్న టైంలో 'లుక్కా చుప్పీ' అనే ఓ సినిమాలో ఛాన్స్ వచ్చింది. చిన్న సినిమానే. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించాడు. లేటెస్ట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. చిన్న సినిమా అయినా పెద్ధ హిట్ కొట్టేసింది. ఫస్ట్ డేనే 8 కోట్లు వసూళ్లు కొల్లగొట్టేసింది. దాంతో కృతిసనన్‌ని పట్టుకోవడం కష్టమైపోయిందండోయ్. ఏకంగా గాల్లో తేలిపోతోంది. ఇంతకీ 'లుక్కా చుప్పీ' అంటే 'దాగుడుమూతలు' అని అర్ధమట.
సినిమాలో హీరో జర్నలిస్టు పాత్రలో కనిపిస్తాడు. కృతిసనన్ ఓ కొంటె పిల్ల క్యారెక్టర్ పోషించింది. హీరో పెళ్లి చేసుకుందామంటాడు. హీరోయిన్ మాత్రం పెళ్లొద్దు, లివింగ్ రిలేషన్‌షిప్పే ముద్దంటుంది. ఈ కాన్సెప్ట్ యూత్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. సినిమా హిట్ అయిపోయింది. దెబ్బకి కృతిసనన్ పాపులర్ అయిపోయింది. ఏదేమైతేనేం ఇటు టాలీవుడ్లో కానీ, అటు బాలీవుడ్లో కానీ హిట్లు లేక విలవిల్లాడిపోతోన్న కృతిసనన్‌కి మొత్తానికో హిట్టొచ్చింది.