కేటీఆర్- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంచి ఉత్సాహవంతుడైన రాజకీయ నాయకుడు అలాగే ఈయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రజల సమస్యలతో పాటుగా తన వ్యక్తిగత విషయాలని కూడా పంచుకుంటూ ఉంటారు.
అలాగే మొన్న శనివారం రాత్రి ఆయన వరుణ్ తేజ్-రాశి ఖన్నాలు నటించిన తొలిప్రేమ సినిమా చూసి, ఆ సినిమా తనకి చాలా బాగా నచ్చింది అంటూ ఆ సినిమాకి సంబంధించిన వారిని అభినందించాడు. వెంటనే ఈయన పెట్టిన పోస్ట్ పట్ల కొందరు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ లో ఆయనని ట్రోల్ చేశారట.
దీనికి ఆయన స్పందిస్తూ- నేను ఏ సినిమా చూడాలి, నేను ఏ ఫోటో పెట్టాలి అన్నది నా ఇష్టం. నేను పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పట్టికీ నాకంటూ ఇష్టాలు, అయిష్టాలు ఉంటాయి. అవి మీకు నచ్చకపోతే నన్ను మీరు అన్ ఫాలో అయిపోవచ్చు అంటూ ఘాటుగా స్పందించాడు.
దీనితో ఒక్కసారిగా ఆయన ఏ సినిమా చూశాడు అంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. మంచి హిట్ టాక్ సంపాదించుకున్న తొలిప్రేమ చిత్రానికి ఇది ఒకరకంగా ఫ్రీ పబ్లిసిటీ అనే చెప్పాలి.