కేటీఆర్‌ పిలుస్తున్నారు.. పవన్‌ వస్తాడా.?

మరిన్ని వార్తలు

మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తిరిగి సినిమాల్లో నటించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. పవన్‌తో ఇటీవల రెండు మూడు సందర్భాల్లో కేటీఆర్‌ మాట్లాడారట. ఈ సందర్భంలో రాజకీయ అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయా.? సినిమాల గురించీ మాట్లాడుకున్నారా? అన్నది తెలియరాలేదు. 

 

'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ప్రసంగించిన కేటీఆర్‌ని పవన్‌కళ్యాణ్‌ అభిమానులు కొంత చికాకు కలిగించేలా వ్యవహరించారు. జనసేన జెండాలతో, 'జై పవన్‌కళ్యాణ్‌' నినాదాలతో 'వినయ విధేయ రామ' ఈవెంట్‌లో హోరెత్తించారు. దాంతో, పవన్‌కళ్యాణ్‌ గురించి కేటీఆర్‌ మాట్లాడక తప్పలేదు. 'మేం ఇటీవల మాట్లాడుకున్నాం. మళ్ళీ పవన్‌ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లోనూ ఆయన రాణించాలన్నది నా ఆకాంక్ష' అని కేటీఆర్‌ చెప్పడంతో పవన్‌ అభిమానులు శాంతించారు. 

 

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, జనసేన కలిసి పనిచేస్తే బావుంటుందనీ అభిమానులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. పవన్‌కళ్యాణ్‌, జనసేన కోసం సినిమాల్ని పక్కన పెట్టారు. 2019 ఎన్నికల కోసం ఆయన సమాయత్తమవుతున్నారు. కేటీఆర్‌ కోరుతున్నారని కాదుగానీ, అభిమానులదీ అదే వాదన. తమ అభిమాన హీరోని తెరపై చూసుకోవాలని పవన్‌ అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ, పవన్‌ ఆ ఛాన్స్‌ ఇస్తారా? అన్నదే వేచి చూడాల్సిన అంశం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS