ముద్దుగుమ్మ నివేదా థామస్‌కి నటన పట్ల ఎంత డెడికేషనో మొదట్నుంచీ చూస్తూనే ఉన్నాం. తెలుగులో 'జెంటిల్‌మెన్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళీ భామ వరుస పెట్టి సినిమాలు చేయకుండా, సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలను ఎంచుకుంటోంది. స్టార్ వేల్యూతో అస్సలు సంబంధం లేదీ భామకి. నటిగా తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో అదే చూసుకుంటుంది.
లేటెస్ట్‌గా '118' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నివేదా థామస్ గురించి, డైరెక్టర్ గుహన్ కొన్ని ఆశక్తికరమైన విషయాల్ని తెలియజేశారు. తాను నటించబోయే సీన్ గురించి, చెప్పబోయే డైలాగ్స్ గురించి ముందే తెలుసుకుని, వాటిపై ఫుల్‌గా కసరత్తులు చేసి, అప్పుడే సెట్స్‌లోకి అడుగుపెడుతుందట. అంతేకానీ, ఏదో డైరెక్టర్ చెప్పారులే, స్పాంటీనియస్‌గా వచ్చింది చేసేశానులే అనుకుని చేతుల దులిపేసుకునే అమ్మాయి కాదట నివేదా థామస్.
ఔట్‌పుట్ విషయంలో ఇంత బాధ్యతగా ఉండే హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారనీ గుహన్ తెలిపారు. 'జై లవకుశ' తర్వాత నివేదా థామస్ నటించిన చిత్రమిది. అంటే లాంగ్ గ్యాపే. కానీ మధ్యలో నివేదా స్టడీస్ కోసం ఆ గ్యాప్ తీసుకుంది. స్టడీస్ కంప్లీట్ చేసి మళ్లీ యాక్టింగ్‌పై ఫోకస్ పెట్టిన నివేదాకి '118' మంచి రిజల్ట్‌నే అందించింది. అయితే నివేదా నెక్స్ట్ ఏంటీ.? అంటే ప్రస్తుతం చర్చల దశలో కొన్ని కథలున్నాయట. వాటిలో నివేదా వేటికి ఓటేస్తుందో చూడాలిక.