ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన నైజాం బుల్లోడు.!

మరిన్ని వార్తలు

యంగ్‌ హీరో నితిన్‌కి అర్జెంట్‌గా ఓ హిట్‌ కావాలి. కానీ ఎలా.? ప్రస్తుతం నితిన్‌ నటిస్తున్న 'భీష్మ' చిత్రం స్టేటస్‌ ఏంటో తెలియరావడం లేదు. సినిమాకి సంబంధించి ఒక్క అప్‌డేట్‌ కూడా రాలేదింతవరకూ. 'ఛలో' ఫేం వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు. రష్మికా మండన్నా హీరోయిన్‌. ఇంతవరకూ బాగానే ఉంది. వీరిద్దరూ తొలి సినిమాతో సక్సెస్‌ టేస్ట్‌ చూసినవారే. మరి వీరి సక్సెస్‌ నితిన్‌కి ఎంతవరకూ ఉపయోగపడనుందో. 

 

ఇదిలా ఉంటే, నితిన్‌ నుండి అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. 'ఇష్క్‌', 'అఆ' వంటి సూపర్‌ హిట్స్‌ కొడితే కానీ నితిన్‌ మళ్లీ రేస్‌లో నిలదొక్కుకునే అవకాశం లేదు. సో సోషల్‌ మీడియాలో నితిన్‌ సక్సెస్‌ కోసం తమదైన సూచనలు, సలహాలు ఇచ్చేస్తున్నారట ఫ్యాన్స్‌. ఫ్యాన్స్‌ అభిమానానికి ధాంక్స్‌ చెబుతున్నాడు నితిన్‌. మరోవైపు తన ఆలస్యానికి సారీ కూడా చెబుతున్నాడు. 

 

అందుకే ఫ్యాన్స్‌ కోసం త్వరలో ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడట నితిన్‌. మరోవైపు 'భీష్మ' సమ్మర్‌ రిలీజ్‌కి సిద్ధమవుతోందనే వార్త కూడా చూచాయగా రివీల్‌ అయ్యింది. అయితే నితిన్‌ త్వరలో ఇవ్వబోయే అప్‌డేట్‌ ఏంటీ.? కొత్త సినిమా అప్‌డేట్‌ ఇస్తాడా.? లేక 'భీష్మ' అప్‌డేటా.? అనేది చూడాలి మరి. ఏది ఏమైనా ఈ ఏడాది ఖచ్చితంగా రెండు సినిమాలతో ఫ్యాన్స్‌కి స్పెషల్‌ కిక్‌ ఇస్తానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడీ నైజాం బుల్లోడు నితిన్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS